GT vs RR: అప్పుడు స్నేహితులు.. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య పోరు.. ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరం..!
GT vs RR: ఈ రోజు (మే 29, ఆదివారం) IPL 2022 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రాత్రి 8 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుంది. రా
GT vs RR: ఈ రోజు (మే 29, ఆదివారం) IPL 2022 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రాత్రి 8 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుంది. రాజస్థాన్ ఒక సారి ఛాంపియన్ అయినప్పటికీ చాలా సంవత్సరాలు గడిచాయి. గుజరాత్ మాత్రం మొదటిసారి ఆడుతోంది. ఇరు జట్లలో టైటిల్ రుచి చూసిన ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు. అయితే వారిద్దరు ఇప్పుడు ఎదురెదురు జట్లలో ఉన్నారు. అంటే ఒకరు గుజరాత్ టైటాన్స్ తరపున, మరొకరు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నారు.
గత సీజన్ వరకు వీరిద్దరు ముంబై ఇండియన్స్ తరపునే ఆడేవారు. వారు ఎవరంటే ఒకరు హార్దిక్ పాండ్యా మరొకరు ట్రెంట్ బౌల్ట్. వీరిద్దరూ కలిసి ముంబై ఇండియన్స్‌ను వరుసగా రెండుసార్లు చాంపియన్‌గా నిలబెట్టారు. అయితే ఇప్పుడు హార్దిక్, బోల్ట్ ముఖాముఖిగా తలపడనున్నారు. బోల్ట్ ఒకే ఒక్క ఫైనల్ ఆడి గెలిచాడు. అదే సమయంలో హార్దిక్ ముంబైతో నాలుగు IPL ఫైనల్స్ ఆడాడు. ప్రతిసారీ ఛాంపియన్‌గా నిలిచాడు. అంటే ఈసారి ఇద్దరిలో ఒకరి రికార్డు మారిపోతుంది.
వీరిద్దరూ మొదటి క్వాలిఫయర్‌లో తలపడగా అక్కడ హార్దిక్ గెలిచాడు. ఆ మ్యాచ్‌లో హార్దిక్ అజేయంగా 40 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. హార్దిక్ వికెట్ తీయడంలో బౌల్ట్ విఫలమయ్యాడు. ఈ పరిస్థితిలో బోల్ట్ దానిని ఈసారి మార్చాలనుకుంటున్నాడు. 2020 ఫైనల్‌లో బోల్ట్ అద్భుతమైన బౌలింగ్ బలంతోనే ముంబై టైటిల్ గెలుచుకుంది. ఆ ఫైనల్లో బోల్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. సహజంగానే ఈ సీజన్‌లో కూడా అతను అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. తన జట్టుకు టైటిల్‌ను అందించడం ద్వారా మరోసారి స్టార్‌గా నిలిచే సత్తా అతడిలో ఉంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి