AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs RR: గుజరాత్ టైటిల్‌ సాధిస్తే హ్యాట్రిక్‌ విజయం.. రాజస్థాన్‌ నిలువరించేనా..!

GT vs RR: ఈ రోజు (మే 29, ఆదివారం) IPL 2022 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రాత్రి 8 గంటలకి మ్యాచ్‌ ప్రారంభంకానుంది.

GT vs RR: గుజరాత్ టైటిల్‌ సాధిస్తే హ్యాట్రిక్‌ విజయం.. రాజస్థాన్‌ నిలువరించేనా..!
Gt Vs Rr
uppula Raju
|

Updated on: May 29, 2022 | 9:17 AM

Share

GT vs RR: ఈ రోజు (మే 29, ఆదివారం) IPL 2022 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రాత్రి 8 గంటలకి మ్యాచ్‌ ప్రారంభంకానుంది. నిజానికి 14 ఏళ్ల తర్వాత రాజస్థాన్‌ రాయల్స్‌ ఐపీఎల్‌ ఫైనల్‌కి వచ్చింది. అయితే ఇక్కడ గుజరాత్‌ టైటాన్స్‌ కప్‌ గెలిస్తే హ్యట్రిక్‌ విజయం సాధించినట్లవుతుంది. ఈ సీజన్‌లో గుజరాత్‌, రాజస్థాన్‌ మధ్య 2 మ్యాచ్‌లు జరగ్గా రెండింటిలో గుజరాత్‌ విజయకేతనం ఎగరేసింది. ఇప్పుడు ఈ ఫైనల్‌లో గెలిస్తే హ్యాట్రిక్‌ విజయం సాధించినట్లవుతుంది. ఐపీఎల్ 2022 ద్వారా గుజరాత్ టైటాన్స్ అరంగేట్రం చేసింది. మొదటి నుంచి ఫైనల్‌ వరకు వరుస విజయాలు గెలుస్తూ వచ్చింది. ఇప్పుడు బలమైన జట్టుగా ఎదిగింది. ఈ పరిస్థితిలో రాజస్థాన్‌.. గుజరాత్ వరుస విజయాలకి అడ్డుకట్ట వేస్తుందా.. కప్‌ గెలుస్తుందా అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి.

IPL 2022 మొదటి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఏప్రిల్ 14 న ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ 37 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై విజయం సాధించింది. 52 బంతుల్లో అజేయంగా 87 పరుగులు చేసి ఆ తర్వాత బంతితో 18 పరుగులకు 1 వికెట్ తీసుకున్న హార్దిక్ పాండ్యా గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. క్వాలిఫయర్ వన్‌లో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో మే 24న ఇరు జట్ల మధ్య రెండో పోరు జరిగింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ గుజరాత్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ను ఓడించి 2-0తో రికార్డును సృష్టించింది. చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 16 పరుగులు చేయాల్సి ఉంది. డేవిడ్ మిల్లర్ 3 సిక్సర్లు కొట్టడం ద్వారా లక్ష్యాన్ని సాధించింది. గుజరాత్‌తో జరిగిన చివరి రెండు మ్యాచ్‌లలో జోస్ బట్లర్ బాగానే ఆడాడు. అయినా కూడా రాజస్థాన్ ఓడిపోయింది. ఎందుకంటే మిగిలిన ఆటగాళ్లు నిరాశపరిచారు. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య సీజన్‌లో మూడో, ఆఖరి, పోరు జరగనుంది. షేన్ వార్న్‌కి టైటిల్ గెలవాలంటే గుజరాత్ హ్యాట్రిక్‌ గెలుపుని ఆపాలి. అప్పుడు ఆయనకి ఘన నివాళి అవుతోంది.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
'చేతులతో కోటనే కదిలించారు' జపాన్‌లో భవనాన్ని జరిపిన ప్రజలు
'చేతులతో కోటనే కదిలించారు' జపాన్‌లో భవనాన్ని జరిపిన ప్రజలు
మీ కరెంట్ బిల్లు తప్పుగా వచ్చిందనే అనుమానం ఉందా..? ఈ సింపుల్..
మీ కరెంట్ బిల్లు తప్పుగా వచ్చిందనే అనుమానం ఉందా..? ఈ సింపుల్..
ప్రకృతిలో విరబూసిన రాఖీ.. ఈ ఫ్లవర్ స్పెషల్ ఇదే..
ప్రకృతిలో విరబూసిన రాఖీ.. ఈ ఫ్లవర్ స్పెషల్ ఇదే..
మరో 2రోజుల్లో NEET PG 2026 ఆన్‌లైన్ పరీక్ష.. అడ్మిట్ కార్డు లింక్
మరో 2రోజుల్లో NEET PG 2026 ఆన్‌లైన్ పరీక్ష.. అడ్మిట్ కార్డు లింక్
చెక్‌బుక్ పోతే ఏం చేయాలి..? ఇది చేయకపోతే బ్యాంక్ ఖాతా ఖాళీ..
చెక్‌బుక్ పోతే ఏం చేయాలి..? ఇది చేయకపోతే బ్యాంక్ ఖాతా ఖాళీ..
వినూత్నంగా రక్షాబంధన్ వేడుక.. గొప్ప సందేశం ఇచ్చిన విద్యార్ధులు!
వినూత్నంగా రక్షాబంధన్ వేడుక.. గొప్ప సందేశం ఇచ్చిన విద్యార్ధులు!
పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే.
పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే.
గోదావరి తీరంలో వేలాది వలస పక్షుల సందడి..
గోదావరి తీరంలో వేలాది వలస పక్షుల సందడి..
'పెళ్లి తర్వాత.. భర్త సంసారానికి పనికిరాడని తెలిస్తే ఏం చేస్తావ్'
'పెళ్లి తర్వాత.. భర్త సంసారానికి పనికిరాడని తెలిస్తే ఏం చేస్తావ్'
రైల్వే స్టేషన్లలో ట్రాఫిక్ అధ్యయనానికి ఐఐటీ-హైదరాబాద్‌ సేవలు
రైల్వే స్టేషన్లలో ట్రాఫిక్ అధ్యయనానికి ఐఐటీ-హైదరాబాద్‌ సేవలు