AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancers: ఈ 3 రకాల క్యాన్సర్లు చాలా ప్రమాదకరం.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తంకండి..!

Cancers: శరీరం మొత్తం కణజాలంతో నిండి ఉంటుంది. అయితే శరీరంలో అవసరంలేని దగ్గర కణజాలం పెరిగిపోవడమే క్యాన్సర్. సాధారణంగా శరీరంలో కణాల విభజన జరుగుతుంది.

Cancers: ఈ 3 రకాల క్యాన్సర్లు చాలా ప్రమాదకరం.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తంకండి..!
Cancers
uppula Raju
|

Updated on: May 28, 2022 | 1:13 PM

Share

Cancers: శరీరం మొత్తం కణజాలంతో నిండి ఉంటుంది. అయితే శరీరంలో అవసరంలేని దగ్గర కణజాలం పెరిగిపోవడమే క్యాన్సర్. సాధారణంగా శరీరంలో కణాల విభజన జరుగుతుంది. ఇలా ప్రతి కణం విభజనకు గురై పుడుతూ చనిపోతూ ఉంటాయి. అయితే శరీరంలో ఈ ప్రక్రియకు ఇబ్బంది కలిగినప్పుడు కొన్ని కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. కణాల్లో ఉండే డీఎన్ఏలో మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. డీఎన్ఏ వల్ల మన తల్లిదండ్రుల్లో ఉండే లక్షణాలే మనకు వస్తాయనే విషయం తెలిసిందే. అలాగే క్యాన్సర్ కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. అంతేగాక.. ఆహారపు అలవాట్లు, రేడియేషన్, స్మోకింగ్, ఊబకాయం తదితర కారణాల వల్ల కూడా డీఎన్‌ఏలో మార్పులు వస్తాయి. దీని వల్ల కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. ఫలితంగా శరీరానికి అవసరమైన కణాలు కంటే ఎక్కువ వృద్ధి చెందుతాయి. అవన్నీ కలిసి ట్యూమర్ (కణితి)గా ఏర్పడతాయి. దీనినే క్యాన్సర్ అని పిలుస్తారు.

1. బ్లడ్ క్యాన్సర్

రక్తకణాలు నియంత్రణ తప్పి అవసరం కంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీన్నే బ్లడ్ క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్ సోకినవారు ఎప్పుడూ అలసటగా, నీరసంగా కనిపిస్తారు. వీరిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల జ్వరంతో బాధపడతారు. ఎక్కువగా ఇన్ఫెక్షన్లకు గురవ్వుతారు. శరీరంలో ల్యూకేమియా సెల్స్ పెరుగుతాయి. దీనివల్ల రోగి నోరు, చర్మం, ఊపిరితీత్తులు, గొంతులో ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. బ్లడ్ క్యాన్సర్ వల్ల బాధితుడి ముక్కు, చిగుళ్ల నుంచి రక్తం స్రవిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన క్యాన్సర్.

ఇవి కూడా చదవండి

2. లంగ్ క్యాన్సర్‌

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తించడం కష్టం. వ్యాధి శరీరంలోని ఇతర భాగాలకు పాకిన తర్వాతే ఇది బయటపడుతుంది. కొన్ని లక్షణాలతో ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని పేర్కొన్నారు. మాటలో అసాధారణ మార్పులు, ఛాతి నొప్పి, వేగంగా బరువు కోల్పోవడం, దగ్గు ఆగకుండా రావడం, బలంగా శ్వాస తీసుకోలేకపోవడంతోపాటు నవ్వినా, దగ్గినా నొప్పి రావడం, గురక లాంటి సమస్యలతో లంగ్ క్యాన్సర్‌ను తెలుసుకోవచ్చు. ఈ లక్షణాలను గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

3. బ్రెస్ట్ క్యాన్సర్

రొమ్ములో ఆకస్మిక మార్పులు సంభవించడాన్ని అస్సలు విస్మరించకూడదు. అది రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణం కావొచ్చు. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే.. రొమ్ము, చంకలో నొప్పిలేని గడ్డలు ఏర్పడుతాయి. రొమ్ము చర్మంపై మార్పులు వస్తాయి. ఇవన్ని రొమ్ము క్యాన్సర్‌ లక్షణాలుగా చెప్పవచ్చు. రొమ్ము క్యాన్సర్‌ డీఎన్‌ఏ లేదా జన్యు పరివర్తన నష్టం కారణంగా అభివృద్ధి చెందుతుంది. రొమ్ము క్యాన్సర్‌తో మరణించే అవకాశం 1 శాతం మాత్రమే అయినప్పటికీ ఇది చాలా ఇబ్బందులని కలిగిస్తుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి