Fruit Side Effects: బరువు తగ్గాలని పండ్లని ఎక్కువగా తింటున్నారా.. ఈ ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..!

Fruit Side Effects: ఈ రోజుల్లో వేగంగా బరువు తగ్గడానికి కొంతమంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు. వ్యాయామాలు కాకుండా ఇష్టమొచ్చిన విధంగా డైట్ ప్లాన్ చేస్తారు.

Fruit Side Effects: బరువు తగ్గాలని పండ్లని ఎక్కువగా తింటున్నారా.. ఈ ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..!
Fruit Side Effects
Follow us

|

Updated on: May 27, 2022 | 9:59 AM

Fruit Side Effects: ఈ రోజుల్లో వేగంగా బరువు తగ్గడానికి కొంతమంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు. వ్యాయామాలు కాకుండా ఇష్టమొచ్చిన విధంగా డైట్ ప్లాన్ చేస్తారు. అయితే ఏదైనా పని చేసే ముందు దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. లేదంటే చాలా నష్టం జరుగుతుంది. తప్పు పద్దతిలో బరువు తగ్గాలని చూస్తే శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. ఇది ఆరోగ్యంపైనే కాదు చర్మంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. చాలామంది ఫ్రూట్ డైట్ ద్వారా బరువు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం పండ్లపైనే ఆధారపడడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

1. గ్యాస్ ఏర్పడటం

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కట్ చేసిన సిట్రస్ పండ్లను తిన్నా లేదా జ్యూస్ తాగినా అది మీకు హాని కలిగిస్తుంది. ఈ పద్ధతి శరీరానికి మంచిది కాదు. దీనివల్ల శరీరంలో మళ్లీ మళ్లీ గ్యాస్ ఏర్పడే సమస్య ఎదురవుతుంది. మీరు రోజంతా హాయిగా ఉండలేరు. తరచూ బాత్రూమ్ వెళ్లాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

2. అతిసారం

చాలా సార్లు బరువు తగ్గాలనే తపనతో పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా రావొచ్చు. పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తు్న్నారు. ఇది మాత్రమే కాదు కడుపు నొప్పి, తిమ్మిరి, తలనొప్పి మొదలవుతుంది. విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. శరీరం బలహీనంగా మారుతుంది.

3. మధుమేహం

బరువు తగ్గడానికి ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్‌గా మారే అవకాశాలు ఉంటాయి. పండ్లలో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పండ్లలో ఫ్రక్టోజ్ ఉంటుంది. శరీరంలో దాని పరిమాణం పెరగడం మధుమేహానికి కారణమవుతుందని పరిశోధనలో వెల్లడైంది.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే