AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL-15: ఐపీఎల్-15 ఫైనల్ మ్యాచ్ కు ప్రధాని మోదీ.!.. భారీ బందోబస్తు చేపట్టిన అధికారులు

ఐపీఎల్‌- 15 వ సీజన్ లో ఆఖరి పోరుకు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్ వేదికగా ట్రోఫీ కోసం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన తొలిసారే ఫైనల్ చేరి అందరి....

IPL-15: ఐపీఎల్-15 ఫైనల్ మ్యాచ్ కు ప్రధాని మోదీ.!.. భారీ బందోబస్తు చేపట్టిన అధికారులు
Pm Modi
Ganesh Mudavath
|

Updated on: May 29, 2022 | 7:15 PM

Share

ఐపీఎల్‌- 15 వ సీజన్ లో ఆఖరి పోరుకు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్ వేదికగా ట్రోఫీ కోసం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన తొలిసారే ఫైనల్ చేరి అందరి దృష్టిని ఆకర్షించిన గుజరాత్.. ఇదే ఊపులో ట్రోఫీ కొట్టేయాలని చూస్తోంది. మరోవైపు ఐపీఎల్ ప్రారంభించిన మొదటి ఏడాదే కప్పు కొట్టి రికార్డు సాధించిన రాజస్థాన్ 14 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరింది. దీంతో ఎలాగైనా ఈసారి ట్రోఫీ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. దీంతో ఇరుజట్ల మధ్య సమరం అత్యంత కీలకంగా మారింది. కాగా ఫైనల్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్టేడియానికి రానున్నట్లు తెలుస్తోంది. వీరి రాక సందర్భంగా అధికారులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతల సమస్యలు రాకుండా స్టేడియం చుట్టు పక్కలా బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 6000 మంది పోలీసులు పహారా కాస్తున్నట్లు తెలుస్తోంది.

స్టేడియం దగ్గర “17 మంది డీసీపీలు, 4 డీఐజీలు, 28 ఏసీపీలు, 51 మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, 268 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 5,000 మందికి పైగా కానిస్టేబుళ్లు, 1,000 మంది హోంగార్డులు, మూడు కంపెనీల ఎస్‌ఆర్‌పీలు బందోబస్త్‌లో పాల్గొంటారని” అహ్మదాబాద్‌ సిటీ కమిషనర్ సంజయ్ శ్రీవాస్తవ వెల్లడించారు. మ్యాచ్‌ను చూసేందుకు 1,25,000 ప్రేక్షకులు రానున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు మ్యాచ్‌ను చూడనుండటం ప్రపంచ క్రికెట్‌లో ఇదే తొలి సారికావడం విశేషం.

మరికొద్ది గంటల్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మొదలు కానుంది. ఈ ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మొతేరా స్టేడియంలో రాత్రి 8 గంటలకు జరగనున్న ఫైనల్ మ్యా్చ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలడుతుండగా.. ఈ రెండింటిలో ఈసారి టైటిల్ కొట్టేదెవరు? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడలు వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి