Congo Fever: ఇరాక్ ను వణికిస్తున్న కాంగో ఫీవర్.. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు తీస్తున్న వైరస్.. 43 ఏళ్లలో తొలిసారిగా

కరోనా, ఒమిక్రాన్, మంకీపాక్స్ కేసులతో అల్లాడుతున్న సమయంలో మరో ప్రాణాంతక వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కాంగో ఫీవర్ తో ఇరాక్ వణుకుతోంది. జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్న ఈ వ్యాధి కేసులు ఇటీవల....

Congo Fever: ఇరాక్ ను వణికిస్తున్న కాంగో ఫీవర్.. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు తీస్తున్న వైరస్.. 43 ఏళ్లలో తొలిసారిగా
Congo Fever
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 29, 2022 | 6:43 PM

కరోనా, ఒమిక్రాన్, మంకీపాక్స్ కేసులతో అల్లాడుతున్న సమయంలో మరో ప్రాణాంతక వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కాంగో ఫీవర్ తో ఇరాక్ వణుకుతోంది. జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్న ఈ వ్యాధి కేసులు ఇటీవల భారీగా నమోదవుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ వ్యాధి బారినపడి 19 మంది మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జ్వరం, ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదమున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇరాక్‌ గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కార్యకర్తలు పీపీఈ కిట్లు ధరించి పశువులపై క్రిమిసంహారకాలను పిచికారి చేయాలని సూచిస్తున్నారు. క్రిమియన్‌ – కాంగో హెమోరేజిక్‌ ఫీవర్‌ అనేది పేలు ద్వారా జంతువుల్లో వ్యాపిస్తుంది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు వంటి జంతువులు వైరస్‌ వాహకాలుగా ఉంటాయి. అలా వైరస్‌ బారినపడిన పశువుల రక్తాన్ని తాకినప్పుడు లేదా వైరస్‌ ఉన్న పేలు కుట్టినప్పుడు మానవులకు సోకుతుంది. ఈ వైరస్‌ సోకిన వ్యక్తులకు శ్వాస ఆడకపోవడం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, తీవ్ర జ్వరంతోపాటు ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగి చివరకు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ వైరస్ ప్రభావానికి గురైన వారి శరీరంలో అంతర్గతంగా, బహిర్గతంగానూ రక్తస్రావం జరుగుతుంది. ఈ వ్యాధి సోకిన ప్రతి ఐదుగురిలో రెండో వంతు కేసుల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతి ఏడాది ఇరాక్‌లో ఐదు కంటే తక్కువ కేసులే నమోదవుతుండగా.. ఈసారి మాత్రం కేసుల సంఖ్య భారీగా ఉండటం కలవరపెడుతోంది. ఇరాక్‌లో 1979లో తొలిసారి వైరస్‌ వెలుగు చూడగా.. గడిచిన 43ఏళ్లలో ఈ స్థాయిలో కేసులను ఎన్నడూ చూడలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా కారణంగా 2020-2021 మధ్య కాలంలో పశువుల్లో క్రిమిసంహారక పిచికారి చేయకపోవడం, గ్లోబర్‌ వార్మింగ్‌ వంటివి వ్యాధి వ్యాప్తికి పలు కారణాలుగా అంచనా వేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ