Nepal Plane Crash: భారీ శబ్ధం వినిపించింది.. పేలిపోయినట్లుగా అనుమానం.. వెల్లడించిన స్థానికులు..

నేపాల్‌లో తారా ఎయిర్‌కు చెందిన విమానం కూలిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి ముస్తాంగ్‌లోని లార్‌జంగ్‌లో ఈ విమాన ప్రమాదం కనిపించినట్లుగా స్థానికులు వెల్లడించారు. ఇది తెలిసిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు..

Nepal Plane Crash: భారీ శబ్ధం వినిపించింది.. పేలిపోయినట్లుగా అనుమానం.. వెల్లడించిన స్థానికులు..
Plane Crashes
Follow us
Sanjay Kasula

|

Updated on: May 29, 2022 | 4:16 PM

నేపాల్​కు చెందిన తారా ఎయిర్​లైన్స్(Tara Air) ​ 9 ఎన్​ఏఈటీ ట్విన్​ ఇంజిన్​ విమానానికి ప్రమాదం జరిగినట్లుగా తేల్చారు. నేపాల్‌లో తారా ఎయిర్‌కు చెందిన విమానం కూలిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి ముస్తాంగ్‌లోని లార్‌జంగ్‌లో ఈ విమాన ప్రమాదం కనిపించినట్లుగా స్థానికులు వెల్లడించారు. ఇది తెలిసిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు నేపాల్ అధికారులు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి సైనిక హెలికాప్టర్‌ను పంపారు. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్‌ ప్రమాదం జరిగిన స్థలానికి సైన్యం, పోలీసు బృందాలు వెళ్లలేకపోయాయి.

అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం..  తారా ఎయిర్‌లోని ఒక ప్రయాణీకుడు, కెప్టెన్ వసంత్ లామా, వృత్తిరీత్యా పైలట్, తారా ఎయిర్  అదే విమానాన్ని నడుపుతున్నాడు. ఆ తర్వాత​ విమానం ఆచూకీ గల్లంతైంది. విమానంలో ముగ్గురు సిబ్బందితో పాటు 19 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పఖోరా నగరం నుంచి కొండ ప్రాంత పట్టణం జోమ్సోమ్​కు 15 నిమిషాల ప్రయాణం కోసం గాల్లోకి ఎగిరిన కాసేపటికే.. ఉదయం 10.35 గంటల ప్రాంతంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయన్నారు. అదే సమయంలో విమానంలో ఉన్న నలుగురు భారతీయ ప్రయాణికులు ఒకే కుటుంబానికి చెందిన ముంబైవాసులుగా గుర్తించారు.

భారీ శబ్ధం వినిపించింది

ఈ విమానం పోఖారా నుంచి జోమ్‌సోమ్‌కు బయలుదేరింది. తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)తో సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు జోమ్సోమ్ సమీపంలోని ఒక ప్రాంతంలో మంటలు కనిపించాయని వార్తలు మొదలయ్యాయి. అదే సమయంలో జోమ్‌సమ్ ఎయిర్‌పోర్ట్ అథారిటీకి కూడా భారీ శబ్ధం వినిపించిందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విమానంలో 13 మంది నేపాలీ, నలుగురు భారతీయ ప్రయాణికులు ఉన్నారు

తారా ఎయిర్ అందించిన వివరాల ప్రకారం.. విమానంలో సిబ్బందితో సహా మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 13 మంది నేపాలీ, నలుగురు భారతీయులు, ఇద్దరు జపాన్ పౌరులు. సిబ్బందిలో విమానం పైలట్, కెప్టెన్ ప్రభాకర్ ప్రసాద్ ఘిమిరే, కో-పైలట్ ఇటాసా పోఖారెల్, ఎయిర్ హోస్టెస్ ఖాస్మీ థాపా ఉన్నారు.

10 ఏళ్లలో 166 మంది మృతి..

2010 నుంచి ఇక్కడ ఏడు భారీ విమాన ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 166 మంది చనిపోయారు. వాస్తవానికి ఇక్కడ జరిగిన ప్రమాదాలు మొత్తం బ్యాడ్ వెదర్ కారణంగా అని తేలింది.