Vastu Tips: ఇంట్లో గులాబీ మొక్క నాటడం శుభమా? అశుభమా? వాస్తు ఏమి చెబుతోంది..?
సాధారణంగా ముళ్ల మొక్కలు ఇంట్లో ఉండటం వాస్తు ప్రకారం మంచిది కాదు. మరి గులాబీ మొక్క విషయం ఏంటి? లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన ఈ పుష్పాన్ని ఇంట్లో నాటడం వల్ల శుభమా, అశుభమా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఏ దిశలో ఉంచితే మంచి ఫలితాలు వస్తాయో వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ ఇంటి తోటలో గులాబీ మొక్క ఉందా? ముళ్ల మొక్క కదా… అశుభం అని తీసివేయాలని ఆలోచిస్తున్నారా? ఆగి ఆలోచించండి! గులాబీ మొక్కకు వాస్తు నియమాలు భిన్నంగా ఉంటాయి. ఇది లక్ష్మీ కటాక్షాన్ని, సామాజిక గౌరవాన్ని పెంచుతుందట. శుభ ఫలితాల కోసం గులాబీ మొక్కను ఎక్కడ నాటాలో వాస్తు సూచనలు చదవండి.
ఇంట్లో ఉంచే అనేక వస్తువులు వాస్తుతో ముడిపడి ఉంటాయి. గులాబీ మొక్కను ఇంట్లో నాటాలా? వద్దా? చాలామంది దీని గురించి ఆలోచిస్తారు. లక్ష్మీదేవి గులాబీ పువ్వును బాగా ఇష్టపడుతుంది. అయినప్పటికీ, కొందరు ఇంట్లో గులాబీ మొక్క పెంచడం అశుభం అంటారు.
శుభమా? ప్రతికూల శక్తి తొలగిపోతుందా?
గులాబీ ఒక ముళ్ల మొక్క. వాస్తు ప్రకారం, ముళ్ల మొక్కలు ఇంట్లో లేదా తోటలో నాటడం అంత మంచిది కాదు. వీటిని ఇంట్లో ఉంచితే ప్రతికూల శక్తి వస్తుంది. కానీ ఈ వాస్తు నియమం గులాబీ మొక్కకు వర్తించదు. గులాబీ పువ్వు లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వు. అందుకే ఇంట్లో పెంచడం శుభం. గులాబీ మొక్కను సరైన దిశలో నాటడం వలన ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
నాటడానికి సరైన దిశలు
మీరు ఇంట్లో గులాబీ మొక్క నాటాలని అనుకుంటే, వాస్తు శాస్త్రం ఉత్తరం లేదా తూర్పు దిశలను సిఫార్సు చేస్తుంది. ఈ దిశలో గులాబీలు నాటితే మీ సామాజిక గౌరవం పెరుగుతుంది.
ప్రేమ జీవితం మెరుగుపడాలంటే…
ప్రేమ జీవితంలో ఇబ్బందులు పడుతున్నవారు బెడ్‌రూమ్‌లో ఒక గాజు పాత్రలో గులాబీ పువ్వు ఉంచాలి. అందులోని నీటిని ప్రతిరోజూ మార్చాలి. ఇది మీ ప్రేమ జీవితాన్ని తిరిగి మెరుగుపరుస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో గులాబీలు నాటితే ఆనందం, శ్రేయస్సు నిలకడగా ఉంటాయి. ఇంటి నుండి చెడు శక్తి తొలగిపోతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి.
గమనిక : సాధారణ నమ్మకాలపై ఆధారపడి రూపొందించబడింది. అందించిన సమాచారం ఖచ్చితత్వం లేదా సంపూర్ణతకు ఇది హామీ ఇవ్వదు. మీ వ్యక్తిగత ఆచారాలు, సంప్రదాయాలు పద్ధతుల కోసం దయచేసి సంబంధిత పండితులు లేదా అర్చకులను సంప్రదించండి.




