JEE Advanced 2026: దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీలలో 2026-27 విద్యాసంవత్సరం ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ విడుదలైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ మే 17న పరీక్షను, ఏప్రిల్ 23న ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను ఖరారు చేసింది. జేఈఈ మెయిన్స్ ఫలితాల తర్వాత దరఖాస్తులు ప్రారంభమవుతాయి. విద్యార్థులు గమనించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.