హైదరాబాద్ పౌరుల కోసం GHMC ఒక వినూత్న వాట్సప్ సేవను ప్రారంభించింది. రోడ్లపై పేరుకుపోయిన చెత్త, నిండిన డస్ట్ బిన్లు, మూసుకుపోయిన నాలాలు, డ్రైనేజీ సమస్యలను 8125966586 నంబర్‌కు ఫోటో, లొకేషన్‌తో వాట్సప్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. GHMC సంబంధిత బృందాలను అప్రమత్తం చేసి తక్షణమే సమస్యలను పరిష్కరిస్తుంది.