తిరుమలకు నెయ్యి తరలిస్తున్న 21 వేల లీటర్ల ట్యాంకర్ కడప జిల్లాలోని కొండాపురం మండలం, జాతీయ రహదారి 67పై బోల్తా పడింది. నెయ్యి రోడ్డుపై ఒలికిపోవడంతో స్థానికులు బిందెలు, బకెట్లతో సేకరించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్లకు స్వల్ప గాయాలయ్యాయి.