పశ్చిమ గోదావరి జిల్లా నూజివీడు ప్రాంతానికి చెందిన మైలక్క అనే మహిళ తన పెరట్లో గంజాయి మొక్కను పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా ఈగల్ టీమ్ నిర్వహించిన సోదాల్లో ఈ గంజాయి మొక్క లభ్యం కావడంతో ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. గంజాయి పెంపకం చట్టవిరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు.