AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్ కార్డు అప్డేట్‌పై కొత్త రూల్స్.. ఒకే ఒక్క క్లిక్‌తో ఈ యాప్ నుంచి సేవలు.. డౌన్ లోడ్ చేసి పెట్టుకోండి..

ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలంటే ఒకప్పుడు ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ ప్రక్రియను సులభతరం చేసింది. కేవలం మీ ఇంటి వద్ద నుంచే నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

Aadhaar Card: ఆధార్ కార్డు అప్డేట్‌పై కొత్త రూల్స్.. ఒకే ఒక్క క్లిక్‌తో ఈ యాప్ నుంచి సేవలు.. డౌన్ లోడ్ చేసి పెట్టుకోండి..
Aadhaar Card
Venkatrao Lella
|

Updated on: Mar 09, 2026 | 3:31 PM

Share

ఆధార్ అనేది దేశంలో నివసించే ప్రతీఒక్క వ్యక్తికి అత్యంత అవసరమైన గుర్తింపు ధృవీకరణ పత్రం. ఇది లేనిది దేశంలో ఎలాంటి ప్రభుత్వ పథకాలు, గవర్నమెంట్ సర్వీసులు పొందలేము. మొబైల్ సిమ్ పొందటం దగ్గర నుంచి ప్రభుత్వ పథకాల వరకు అనేక ప్రయోజనాల పొందేందుకు ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది. దేశంలో నివసించే ప్రతీవ్యక్తి వయస్సు, లింగంతో సంబంధం లేకుండా ఈ 12 అంకెల యూనిక్ నెంబర్‌తో కూడిన కార్డును తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే క్యూఆర్ కోడ్, పేరు, డేట్ ఆఫ్ బర్త్, తండ్రి పేరు, లింగం, అడ్రస్ వంటి వివరాలు మీ గుర్తింపును నిర్ధారించడంలో సహాయపడతాయి.

మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం ఎలా..?

ఆధార్‌తో మొబైల్ నెంబర్ లింక్ చేయడం అనేది తప్పనిసరి. లేకపోతే ఓటీటీ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది చేయలేము. ఇటీవల కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఆధార్ యాప్‌తో సులువుగా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ పొగొట్టుకుంటే మొబైల్ నెంబర్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు మొబైల్ నెంబర్ మార్చుకోవాలంటే ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మీరు మొబైల్ యాప్ ద్వారా సులువుగా ఇంటి వద్దనే నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు.

ఎలా అంటే..?

-మొబైల్ ఫోన్‌లో ఆధార్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోండి

-ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ సిస్టమ్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వండి

-హోమ్ పేజీలో సర్వీసెస్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి

-అప్ డేట్ మొబైల్ నెంబర్‌ ఆప్షన్ ఎంచుకోండి

-ప్రస్తుతం ఉన్న ఫోన్ నెంబర్ అక్కడ కనిపిస్తుంది

-మీరు లింక్ చేసుకోవాలనుకున్న ఫోన్ నెంబర్ కనిపిస్తుంది

-మీ కొత్త మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి

-ఈ తర్వాత ప్రామాణీకరణ ప్రక్రియను పూర్తి చేయండి

-సర్వీస్ ఛార్జీ ఆన్ లైన్ ద్వారా చెల్లించండి

-ఆ తర్వాత కొన్ని రోజుల్లో మీ మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది

-అప్డేట్ అయ్యాక కొత్త మొబైల్ నెంబర్‌కు మెస్సేజ్ వస్తుంది

సర్వీస్ ఛార్జీ ఎంతంటే..?

అయితే అప్లికేషన్ ద్వారా మొబైల్ నంబర్ లేదా చిరునామాను నవీకరించడానికి నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ అప్డేట్ కోసం రూ. 75 చెల్లించాల్స ఉంటుంది.  రిక్వెస్ట్ సబ్మిట్ చేశాక మొబైల్ నెంబర్ అప్డేట్ కావడానికి 10 నుండి 15 రోజులు సమయ పడుతుంది. ఒక్కొసారి నెల రోజుల సమయం కూడా పట్టివచ్చు.  మీరు మొబైల్ నెంబర్ స్టేటస్‌ను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండవచ్చు.

Follow Us