AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!

Gold, Silver Prices Today: అంతర్జాతీయంగా బంగారం ధర ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇరాన్‌పై అమెరికా జరిపిన కొత్త దాడుల కారణంగా ముడి చమురు ధరలు దాదాపు రెండు శాతం పెరిగాయి. ఇది ద్రవ్యోల్బణం, దీర్ఘకాలిక అధిక వడ్డీ రేట్లపై..

Gold Price Today: రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
అంతర్జాతీయ మార్కెట్ అయిన కామెక్స్‌లో బంగారం ధరలు పెరిగాయి. అమెరికా డాలర్ బలహీనపడటం, వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు తగ్గడం వంటివి బంగారం ధరలకు మద్దతునిచ్చాయి. గణాంకాల ప్రకారం, బంగారం ధరలు 1.63% పెరిగి, ఔన్సుకు $69.20 చేరి, $4,194 కు చేరుకున్నాయి. వెండి ధరలు కూడా 2.83% పెరిగి, ఔన్సుకు $62.790 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
Subhash Goud
|

Updated on: Jun 12, 2026 | 6:32 AM

Share

Gold, Silver Prices Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో దిగి వస్తు్న్నాయి. గతంలో పరుగులు పెట్టిన ధరలు తాజాగా రికార్డు స్థాయిలో తగ్గుముఖం పడుతున్నాయి. రోజు వేలల్లో ధరలు తగ్గుతున్నాయి. తాజాగా జూన్‌ 12న దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రామల బంగారం ధర రూ.1,45,630 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,490 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర రూ.2,49,900 వద్ద ట్రేడవుతోంది. అయితే కేవలం మూడు రోజుల్లోనే రూ.7,500 వరకు దిగి వచ్చింది బంగారం ధర.

ఇది కూడా చదవండి: Gold Jewellery: మీరు బంగారు నగలు కొంటున్నారా? ఇదొక్కటి గుర్తించకపోతే భారీగా నష్టపోతారు.. జాగ్రత్త!

  1. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రామల బంగారం ధర రూ.1,45,780 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,640 వద్ద ట్రేడవుతోంది.
  2. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రామల బంగారం ధర రూ.1,45,630 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,490 వద్ద ట్రేడవుతోంది.
  3. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రామల బంగారం ధర రూ.1,45,630 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,490 వద్ద ట్రేడవుతోంది.
  4. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రామల బంగారం ధర రూ.1,47,270 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,990 వద్ద ట్రేడవుతోంది.
  5. ఇక వెండి విషయానికొస్తే.. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,59,900 వద్ద ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఇతర ప్రాంతాల్లో రూ.2,49,900 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయంగా బంగారం ధర ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇరాన్‌పై అమెరికా జరిపిన కొత్త దాడుల కారణంగా ముడి చమురు ధరలు దాదాపు రెండు శాతం పెరిగాయి. ఇది ద్రవ్యోల్బణం, దీర్ఘకాలిక అధిక వడ్డీ రేట్లపై పెట్టుబడిదారుల ఆందోళనలను మరింత పెంచుతోంది. అమెరికా సైన్యం ఇరాన్‌లోని పలు లక్ష్యాలను ఛేదించింది. శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Fuel Excise Duty: పెట్రోల్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎక్సైజ్ సుంకం పూర్తిగా రద్దు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us