Gold Investments: ఇప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చా.. మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారు..
బాండ్ ఈల్డ్స్ పతనం, డాలర్ ఇండెక్స్ పతనం కారణంగా గత రెండు వారాలుగా బంగారం(Gold) ధర పెరుగుతూ వస్తోంది. 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ ఆరు వారాల కనిష్టానికి పడిపోయింది.
బాండ్ ఈల్డ్స్ పతనం, డాలర్ ఇండెక్స్ పతనం కారణంగా గత రెండు వారాలుగా బంగారం(Gold) ధర పెరుగుతూ వస్తోంది. 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ ఆరు వారాల కనిష్టానికి పడిపోయింది. అదే సమయంలో డాలర్ ఇండెక్స్ వరుసగా రెండవ వారం క్షీణతను చూస్తోంది. ఈ వారం డాలర్ ఇండెక్స్ 101.65కి పడిపోయింది. డాలర్ ఇండెక్స్(doller index) వారంవారీ ప్రాతిపదికన 1.43 శాతం, గత వారం 1.38 శాతం తగ్గింది. 10 సంవత్సరాల US బాండ్ రాబడి ఈ వారం 2.734 శాతం వద్ద ముగిసింది. ఈ వారం 1.62 శాతం, అంతకు ముందు 4.76 శాతం, అంతకు ముందు వారంలో 6.84 శాతం క్షీణించింది. బంగారం ధరను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం. బంగారం ధర 1,865 డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే, అప్పుడు ర్యాలీ కొనసాగుతుందని కమోడిటీ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రికార్డు జంప్ కారణంగా, డాలర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది. దీని కారణంగా బంగారం డిమాండ్ పెరిగింది. దేశీయ మార్కెట్‌లో బంగారం ధర రూ.53000 స్థాయికి చేరుకునే. ఈ వారం రూ.50928 స్థాయిలో ముగిసింది.
ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్‌కు చెందిన అనూజ్ గుప్తా మాట్లాడుతూ 20 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరుకున్న తరువాత, డాలర్ ఇండెక్స్ 101కి పడిపోయింది. దీంతో గత రెండు వారాలుగా బంగారం ధర పెరుగుతూ వస్తోందన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో మందగమన సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు. అటువంటి పరిస్థితిలో, డాలర్ ఇండెక్స్ మరింత తగ్గితే, అప్పుడు బంగారం ధర పెరుగుతుందని అంచనా వేశారు. చైనీస్ తయారీ డేటా ఈ వారం రాబోతోంది. లాక్‌డౌన్ తర్వాత చైనాలో కార్యకలాపాలు మళ్లీ ఊపందుకున్నాయి. అటువంటి పరిస్థితిలో మొత్తం ప్రపంచం దృష్టి చైనా తయారీ డేటాపై ఉంది. ఈ డేటా మార్కెట్‌తో సరిపోలకపోతే, స్టాక్ మార్కెట్‌లో అమ్మకాలు పెరగవచ్చు, పెట్టుబడిదారులు బంగారం వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్‌తో పాటు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా వడ్డీ రేటును పెంచుతోంది. మళ్లీ వడ్డీ రేటు పెంచేస్తారని నమ్ముతున్నారు. ఇదే జరిగితే వడ్డీ రేటు విలువ పెరగడంతో ఎఫ్‌ఐఐలు యూరోలను విక్రయించి కొనుగోలు చేస్తారు. దీని ప్రభావం డాలర్‌పై పడనుంది. ఈ నేపథ్యంలో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.