Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card Tips: క్రెడిట్ కార్డ్ విషయంలో ఆ 5 తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే ఎక్కువ నష్టపోతారు..

Credit Card Tips: డిజిటల్ యుగంలో ప్రజలు క్రెడిట్ కార్డ్‌లను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. క్రెడిట్ కార్డ్‌పై డిస్కౌంట్లు, ఆఫర్‌లు అందుబాటులో ఉన్న రివార్డ్ పాయింట్‌ల వరకు అనేక వెసులుబాట్లు ఉంటాయి. అంటే క్రెడిట్ కార్డ్ ఉంటే మీరు అదనపు ప్రయోజనాలను పొందుతారు. అయితే..

Credit Card Tips: క్రెడిట్ కార్డ్ విషయంలో ఆ 5 తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే ఎక్కువ నష్టపోతారు..
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 30, 2022 | 8:17 AM

Credit Card Tips: డిజిటల్ యుగంలో ప్రజలు క్రెడిట్ కార్డ్‌లను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. క్రెడిట్ కార్డ్‌పై డిస్కౌంట్లు, ఆఫర్‌లు అందుబాటులో ఉన్న రివార్డ్ పాయింట్‌ల వరకు అనేక వెసులుబాట్లు ఉంటాయి. అంటే క్రెడిట్ కార్డ్ ఉంటే మీరు అదనపు ప్రయోజనాలను పొందుతారు. అయితే.. క్రెడిట్ కార్డ్ నిజానికి రుణం అని చాలా మంది మరచిపోతుంటారు. అది మీరు తర్వాత చెల్లించాలి లేదా సకాలంలో చెల్లించకపోతే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. మీరు సకాలంలో బిల్లు తిరిగి చెల్లించలేకపోతే.. ఎక్కుడ డబ్బును కోల్పోవడమే కాకుండా.. మీ CIBIL స్కోర్ కూడా దెబ్బతింటుందని గుర్తుంచుకోవాలి. మీరు విషయాల కోసం క్రెడిట్ కార్డ్‌ని ఎప్పుడూ ఉపయోగించపోవటం ఉత్తమమో ఇప్పుడు తెలుసుకోండి.

  1. ATM డబ్బు విత్ డ్రా చేసుకోవటానికి: క్రెడిట్ కార్డును ఇచ్చే ప్రతి కంపెనీ ఖచ్చితంగా ATM ద్వారా కూడా ఆ కార్డు నుంచి నగదు తీసుకోవటానికి అనుమతిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై మీకు ఒక నెల సమయం మాత్రమే ఉంటుంది. మరోవైపు నగదుపై.. మీకు చెల్లింపు కోసం సమయం ఉండదు. అందువల్ల నగదు విత్ డ్రా చేసుకున్న వెంటనే మీపై వడ్డీ భారం ప్రారంభమవుతుంది. ఈ వడ్డీ నెలకు 2.5 నుంచి 3.5 శాతం వరకు ఉంటుంది. ఇది మాత్రమే కాదు.. మీరు దీనిపై ఫ్లాట్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
  2. క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు విదేశాల్లో కూడా ఆ కార్డును వినియోగించుకోవచ్చంటూ ఫైనాన్స్ సంస్థలు ప్రలోభాలకు గురవుతున్నారు. అయితే.. దీని వెనుక ఉన్న కథ చాలా భిన్నంగా ఉంటుంది. విదేశాల్లో మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించినందుకు విదేశీ కరెన్సీ లావాదేవీల ఛార్జీలను వసూలు చేస్తాయి. అదే సమయంలో.. మారకం రేటులో హెచ్చుతగ్గుల ప్రభావం వినియోగదారులపై పడుతుంది. మీరు విదేశాల్లో నగదు ఉపయోగించకూడదనుకుంటే.. క్రెడిట్ కార్డ్‌కు బదులుగా ప్రీపెయిడ్ కార్డ్‌ని ఉపయోగించటం ఉత్తమం. కాబట్టి విదేశాల్లో క్రెడిట్ కార్డు వినియోగించకండి.
  3. చాలా సార్లు ప్రజలు తమ క్రెడిట్ కార్డులను పూర్తి లిమిట్ వరకు ఉపయోగిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో.. కొన్ని సార్లు క్రెడిట్ కార్డుపై ఉండే క్రెడిట్ పరిమితి కంటే ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. గుర్తుంచుకోండి.. మీరు మీ పరిమితి కంటే ఎక్కువ ఖర్చు చేస్తే, దాని కోసం కంపెనీ మీకు ఛార్జీ కూడా విధించింది. మరోవైపు వినియోగదారులు క్రెడిట్ పరిమితిలో 30 శాతం కంటే ఎక్కువ ఉపయోగిస్తే.. అది మీ CIBIL స్కోర్‌పై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
  4. క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే వారు తప్పనిసరిగా క్రెడిట్ కార్డ్ బిల్లులో రెండు రకాల బకాయి మొత్తాలు ఉన్నాయని తెలుసుకోవాలి. ఒకటి బకాయి మొత్తం, మరొకటి కనీసం చెల్లించాల్సిన మొత్తం. చెల్లించాల్సిన కనీస మొత్తం తక్కువ ఉన్నప్పటికీ దాన్ని మాత్రమే చెల్లించి తప్పు చేయవద్దు. బకాయి మెుత్తంలో మినియం పేమెంట్ చెల్లించడం వల్ల  మీరు భారీ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది మెుత్తం చెల్లించాల్సిన బ్యాలెన్స్ పై ఛార్జ్ చేయబడుతుంది. క్రెడిట్ కార్డ్ చెల్లింపులు చేస్తున్నప్పుడు పూర్తి మెుత్తాన్ని చెల్లించటం ఉత్తమం. దీనివల్ల అదనపు వడ్డీ భారాన్ని భరించాల్సిన అవసరం ఉండదు. క్రెడిట్ కార్డు బకాయిపై ఏడాదికి ఏకంగా 48 శాతం వరకు వడ్డీ ఉంటుందని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. అందువల్ల బిల్లింగ్ సైకిల్ లో పూర్తి చెల్లింపు చేయాలి.
  5. అనేక క్రెడిట్ కార్డ్‌లలో బ్యాలెన్స్ బదిలీ ఎంపిక అందుబాటులో ఉంది. బ్యాలెన్స్ బదిలీ అంటే మీరు మీ క్రెడిట్ కార్డ్‌లలో ఒకదాని నుంచి మరొక క్రెడిట్ కార్డ్‌కి బిల్లులను చెల్లించవచ్చు. అయితే.. దీని కోసం మీరు కొంత వడ్డీ కూడా చెల్లించాలి. కొన్నిసార్లు బ్యాలెన్స్ బదిలీ లాభదాయకమైనదే. కానీ ఒక కార్డు బిల్లును మరొక దాని నుంచి చెల్లించే విధంగా చేయవద్దు. ఆపై రెండవది, మూడవది నుంచి నాల్గవదానికి చెల్లింపులు చేయటం వల్ల మీ CIBIL స్కోర్ తీవ్రంగా దెబ్బతింటుంది. వాస్తవానికి మీరు ఒక రుణాన్ని చెల్లించటానికి మరొక రుణాన్ని తీసుకుంటున్నారని.. దాని కోసం ఇంకొకటి తీసుకుంటున్నారని అర్థం. ఇలా చేయటం వల్ల దీర్ఘకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది.

మీరూ పుచ్చకాయ తినేసి గింజలు విసిరేస్తున్నారా? ఆగండాగండీ..
మీరూ పుచ్చకాయ తినేసి గింజలు విసిరేస్తున్నారా? ఆగండాగండీ..
హార్ట్ హెల్త్ కోసం ఉదయాన్నే తినాల్సిన 4 సూపర్ ఫుడ్‌లు..!
హార్ట్ హెల్త్ కోసం ఉదయాన్నే తినాల్సిన 4 సూపర్ ఫుడ్‌లు..!
రిటైర్మెంట్‌‌పై మౌనం వీడిన మిస్టర్ కూల్.. ఏమన్నాడంటే?
రిటైర్మెంట్‌‌పై మౌనం వీడిన మిస్టర్ కూల్.. ఏమన్నాడంటే?
సౌత్ ఇండియాలో ఎవ్వరికీ తెలియని అతి సుందరమైన హిల్ స్టేషన్స్ ఇవే!
సౌత్ ఇండియాలో ఎవ్వరికీ తెలియని అతి సుందరమైన హిల్ స్టేషన్స్ ఇవే!
చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా మారిన అనన్య నాగళ్ల
చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా మారిన అనన్య నాగళ్ల
రోజూ బట్టలు ఉతికే అలవాటు మీకూలేదా? ఎంత డేంటరో తెలుసా..
రోజూ బట్టలు ఉతికే అలవాటు మీకూలేదా? ఎంత డేంటరో తెలుసా..
పరికిణిలో అందంగా.. ఆషు ఇలా చూసి చాలా కాలమే అయ్యింది!
పరికిణిలో అందంగా.. ఆషు ఇలా చూసి చాలా కాలమే అయ్యింది!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ రిజక్ట్ చేసిన నయన్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ రిజక్ట్ చేసిన నయన్?
మార్కో క్యాచ్ డ్రాప్‌తో మండిపడ్డ పంజాబీ సింగర్.. వీడియో వైరల్!
మార్కో క్యాచ్ డ్రాప్‌తో మండిపడ్డ పంజాబీ సింగర్.. వీడియో వైరల్!
మీ బూట్ల దుర్వాసన సింపుల్‌గా తొలగించే చిట్కాలు.. మీరూ ట్రై చేయండి
మీ బూట్ల దుర్వాసన సింపుల్‌గా తొలగించే చిట్కాలు.. మీరూ ట్రై చేయండి