Income Tax: ఏ పద్ధతిలో ITR ఫైల్ చేయాలో అర్ధం కావటం లేదా.. ఇప్పుడు తెలుసుకోండి.. టాక్స్ మిగుల్చుకోండి..

Income Tax: ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసేందుకు కేంద్రం రెండో విధానాన్ని తీసుకురావటం అనేక మందికి గందరగోళం కలిగిస్తోంది. ఏ పద్ధతి మీకు సూట్ అవుతుందో ఇప్పుడు తెలుసుకోండి. టాక్స్ ఆదా చేసుకోండి.

Income Tax: ఏ పద్ధతిలో ITR ఫైల్ చేయాలో అర్ధం కావటం లేదా.. ఇప్పుడు తెలుసుకోండి.. టాక్స్ మిగుల్చుకోండి..
Income Tax
Follow us

|

Updated on: May 29, 2022 | 7:11 PM

Income Tax: రవికాంత్ విశాఖకు చెందిన వర్కింగ్ ప్రొఫెషనల్. ఇప్పటి వరకు పాత టాక్స్ విధానం ఆధారంగా పన్నులు చెల్లిస్తున్నాడు. కానీ మోడీ ప్రభుత్వం 2020 బడ్జెట్‌లో కొత్త టాక్స్ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత రవికాంత్ దేన్ని ఎంచుకోవాలో తికమక పడ్డాడు. యూనియన్ బడ్జెట్ 2022 పన్ను స్లాబ్‌లలో ఎటువంటి కీలక మార్పులు చేయలేదు. కాబట్టి రవికాంత్ వంటి పన్ను చెల్లింపుదారులు పాత పద్ధతిని ఫాలో అవ్వాలా లేక కొత్త విధానాన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు.. కొత్త టాక్స్ విధానంపై చాలా గందరగోళం నెలకొంది. ఏది ఎంచుకోవాలో ప్రజలు నిర్ణయించుకోలేకపోతున్నారు. పన్ను విధానాల మధ్య ఎంపిక అనేది ప్రస్తుత ఆదాయ స్థాయి, ఆదాయ వనరులు, పెట్టుబడి & పొదుపు అలవాట్లు వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉండవచ్చు. కొత్త టాక్స్ విధానం పాతదాని కంటే రెండు రకాలుగా భిన్నంగా ఉంటుంది. ముందుది తక్కువ పన్ను రేట్లతో ఎక్కువ స్లాబ్‌లను కలిగి ఉంది. రెండవది కొత్త టాక్స్ విధానాన్ని ఎంచుకుంటే.., పాత పన్ను విధానంలో టాక్స్ పేయర్స్ కు అందుబాటులో ఉన్న అన్ని ప్రధాన మినహాయింపులు, తగ్గింపులు అనుమతించబడవు. పాత, కొత్త పన్ను విధానాల మధ్య ప్రధాన వ్యత్యాసం స్లాబ్ రేట్లలోనే. కాబట్టి అధిక ఆదాయం ఉన్న టాక్స్ పేయర్స్ ఎక్కువ పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త టాక్స్ విధానం వ్యక్తులు, HUFకి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమేనని ఆదాయపన్ను శాఖ తెలిపింది. కొత్త పన్ను విధానం కింద రూ.15 లక్షల ఆదాయం వరకు రాయితీ రేట్లను అందిస్తుంది. 5%, 10%, 15%, 20%, 25% టాక్స్ స్లాబ్‌ల ప్రకారం ప్రాథమిక మినహాయింపు రూ.2.50 లక్షలుగా ఉంది. ఒక వేళ మీ వార్షిక ఆదాయం రూ.15 లక్షలుగా ఉన్నట్లయితే కొత్త టాక్స్ విధానానికి మారడం వల్ల దాదాపు రూ. 75,000 వరకు క్యుములేటివ్ బెనిఫిట్ తో పాటు 4 శాతం సెస్. కొత్త టాక్స్ విధానం ప్రకారం ఎలాంటి డిడక్షన్స్ పొందేందుకు అవకాశం ఉండదు. కానీ పాత టాక్స్ పద్ధతిలో వివిధ సెక్షన్ల కింత మినహాయింపులు లభిస్తాయి.

కొత్త పన్ను విధానం టాక్స్ పేయర్స్ కు తగ్గింపులు లేదా మినహాయింపు ఎంపికలను క్లెయిమ్ ఎలాంటి వెసులుబాటు లేనప్పటికీ.. పాత టాక్స్ విధానం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడానికి దాదాపు 70 రకాల తగ్గింపులు, మినహాయింపులను అందిస్తోంది. వేతనదారుల విషయానికొస్తే.. వారు కొత్త టాక్స్ విధానాన్ని ఎంచుకుంటే స్టాండర్డ్ డిడక్షన్, హౌస్ రెంట్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ అసిస్టెన్స్ మొదలైన ప్రధాన ప్రయోజనాలను పొందలేరు. రిటైర్డ్ సీనియర్ సిటిజన్ విషయానికొస్తే.. వారు కొత్త టాక్స్ విధానాన్ని ఎంచుకుంటే మాజీ యజమాని నుంచి పెన్షన్‌కు సంబంధించి స్టాండర్డ్ డిడక్షన్‌ను అలాగే పోస్ట్ ఆఫీస్, బ్యాంకుల నుంచి వడ్డీకి సంబంధించి మినహాయింపును పొందలేరు. కానీ వారు అధిక ప్రాథమిక మినహాయింపు పరిమితిని కలిగి ఉన్నారు. గ్రాట్యుటీ, కమ్యూటెడ్ పెన్షన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ప్రావిడెంట్ ఫండ్‌గా స్వీకరించిన మొత్తంపై పన్ను నుంచి కూడా మినహాయింపు లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

కొన్ని షరతుల ప్రకారం సీనియర్ సిటిజన్లు ITR ఫైల్ చేయనవసరం లేదని టాక్స్ ఎక్స్ పర్ట్, చార్టర్డ్ అకౌంటెంట్ రాజ్ చావ్లా చెప్పారు. అసెస్ మంట్ ఇయర్ 2022-23 నుంచి 75 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్‌లు పెన్షన్ ఆదాయం, వడ్డీ ఆదాయాన్ని మాత్రమే కలిగి ఉన్నట్లయితే.. వాటిని అందుకుంటున్న బ్యాంకులోనే అకౌంట్ ఉన్నట్లయితే ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైవ్ చేయనవసరం లేదని రాజ్ చావ్లా వెల్లడించారు.

ఇప్పుడు… మీకు ఏ స్కీమ్ ఉత్తమంగా పని చేస్తుందో మీరు తప్పక ఆలోచిస్తారు. సరే.. ఈ పన్ను ప్రయోజనాల కూర్పు వ్యక్తుల మధ్య మారుతూ ఉంటుంది కాబట్టి రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అనేదానికి ఖచ్చితమైన సమాధానం లేదు. అయితే, పన్ను చెల్లింపుదారుల్లో ఎక్కువ మంది వదులుకోవాల్సిన టాక్స్ ప్రయోజనాలను పరిశీలిస్తే, ప్రస్తుతం పాత విధానంలో లభించే ప్రయోజనాలు కొత్త విధానంలో లభించే తక్కువ రేట్ల ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకించి జీతాలు తీసుకునే వ్యక్తులు, హోమ్ లోన్ తీసుకున్న వారి విషయంలో ఈ వ్యత్యాసం ఉంటుంది.

మీరు జీతం పొందే వ్యక్తి అయితే మీరు ప్రతి సంవత్సరం ఈ ఎంపిక చేసుకోవచ్చు. “‘జీతం’, ‘హౌస్ ప్రాపర్టీ’, ‘క్యాపిటల్ గెయిన్స్’, ‘ఇతర వనరులు’ కింద ఆదాయం ఉన్న వ్యక్తులు పాత లేదా కొత్త పన్ను విధానం మధ్య మారడానికి ప్రతి సంవత్సరం ఎంచుకోవచ్చు. కానీ వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం ఉన్న వ్యక్తులు కొత్త టాక్స్ విధానాన్ని ఎంచుకున్న తర్వాత పాత విధానానికి తిరిగి రావడానికి ఒకే ఒక్క అవకాశం ఉంటుంది. వారు జీవితకాలంలో ఒకసారి మాత్రమే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. టాక్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాత పన్ను విధానం ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే వారు సామాజిక భద్రతా పథకాల్లో చేసే పెట్టుబడులపై టాక్స్ మినహాయింపు ప్రయోజనాలు పొందుతున్నారు కాబట్టి.

కొత్త, పాత విధానాన్ని ఎవరు ఎంచుకోవాలి అనే విషయంపై, రాజ్ చావ్లా ఏమంటున్నారంటే.. “చాలా మంది టాక్స్ పేయర్స్ సెక్షన్- 80C కింద గరిష్ఠ పన్ను మినహాయింపులు, హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ చేయడం, రీయింబర్స్ చేయడం వంటి ప్రయోజనాల కోసం ఆలోచిస్తే పాత విధానంలో ఉండటం వల్ల ఎక్కువ ప్రయోజనన్ని పొందుతారు. పన్ను ఆదా చేసే పెట్టుబడులు లేని యువ జనాభా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నారు.”చాలా మంది టాక్స్ పేయర్స్ లాక్-ఇన్ పీరియడ్‌ని కలిగి ఉన్న సెక్షన్- 80C ఇన్వెస్ట్‌మెంట్‌ల కింద ఫండ్‌లను లాక్ చేయకుండా ఉండాలనుకుంటున్నందున కొత్త టాక్స్ విధానాన్ని ఎంచుకుంటున్నారు. ఈ పన్ను చెల్లింపుదారులు తమ ఆస్తులను 3-5 సంవత్సరాల పాటు టాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్లలో లాక్ చేయకుండా FDలలో పెట్టుబడి పెట్టడాన్ని ఎంచుకుంటున్నారని రాజ్ చావ్లా తెలిపారు. మీకు వార్షిక ఆదాయం ఎక్కువగా ఉన్నట్లయితే పాత టాక్స్ విధానం కొత్తదానికంటే మెరుగైన ఎంపిక. కొత్త టాక్స్ విధానం న్యూ ఇన్వెస్టర్లు, ఇటీవలే కెరీర్‌ను ప్రారంభించిన వ్యక్తులకు అనుగుణంగా రూపొందించబడింది.

భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.