AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST On School Services: విద్యాసంస్థలకు గుడ్ న్యూస్.. జీఎస్టీ విషయంలో AAR సంచలన నిర్ణయం..

GST On School Services: పాఠశాలలు అందించే క్యాంటీన్, రవాణా సేవలు ప్రస్తుతం GST పరిధిలో ఉన్నాయి. మహారాష్ట్ర అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (AAR) దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది.

GST On School Services: విద్యాసంస్థలకు గుడ్ న్యూస్.. జీఎస్టీ విషయంలో AAR సంచలన నిర్ణయం..
Schools
Ayyappa Mamidi
|

Updated on: May 29, 2022 | 5:38 PM

Share

GST On School Services: పాఠశాలలు అందించే క్యాంటీన్, రవాణా సేవలు ప్రస్తుతం GST పరిధిలో ఉన్నాయి. మహారాష్ట్ర అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (AAR) దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా అనేక పాఠశాలలకు ఉపశమనం లభించనుంది. GST ఫ్రేమ్‌వర్క్ ప్రకారం స్కూల్ ఫీజులకు ఎలాంటి పన్ను లేదు. ఇదే సమయంలో వారికి అందించే వివిధ సేవలు అసలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయా.. రావా అనే అంశంపై చర్చ జరిగింది. విద్యార్థులు చెల్లించే ఫీజులు, వారికి అందించే వస్తువులు, ప్రీ-స్కూల్ విద్యార్థులకు, అధ్యాపకులు/సిబ్బందికి రవాణా సేవలు, ప్రీ-స్కూల్ విద్యా సేవలపై ఎటువంటి పన్ను రేటు లేదని మహారాష్ట్ర అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ స్పష్టం చేసింది. ఈ మేరకు మే 25న స్పష్టతనిచ్చింది. పాఠశాల ఇప్పటికే స్కూల్ ఫీజుతో పాటు డబ్బు వసూలు చేస్తున్నట్లయితే ఈ సేవలను “కాంపోజిట్ సప్లయిస్”గా పరిగణించవచ్చని తీర్పు చెప్పింది.

చాలా పాఠశాలలు, విద్యా సంస్థలు ఈ సేవలపై GST సమస్యను ఎదుర్కొంటున్నాయని పన్ను నిపుణులు అంటున్నారు. పాఠశాల ఫీజుతో పాటు అందించే బస్సుకు.. డబ్బు చెల్లింపు లేదా సదరు సర్వీస్ ఎలా అందించబడుతుందనే దాని ఆధారంగా పన్ను విధించబడుతుందా లేదా అనే అంశం నిర్ణయించబడుతుంది. ఇదే సమయంలో క్సాసినోలు, ఆన్‌లైన్ గేమింగ్, రేస్ కోర్సులు వంటి వాటిపై అత్యధికంగా 28 శాతం జీఎస్టీ విధించేందుకు మంత్రుల ప్యానల్ సమీక్షలో నిర్ణయించింది.