ONGC Profit: దిమ్మదిరిగే లాభాలు ఆర్జించిన ప్రభుత్వ సంస్థ.. ఆ కారణంగానే ఊహించని లాభాలు..

ONGC Profit: ప్రభుత్వ రంగంలోని చమురు వ్యాపారంలో ఉన్న ఓఎన్జీసీ మంచి లాభాలను నమోదు చేసింది. ఇందుకు గాను ఆ అంశాలు ప్రధానంగా కలిసి వచ్చాయని చెప్పుకోవాలి.

ONGC Profit: దిమ్మదిరిగే లాభాలు ఆర్జించిన ప్రభుత్వ సంస్థ.. ఆ కారణంగానే ఊహించని లాభాలు..
Ongc
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 29, 2022 | 4:52 PM

ONGC Profit: పెరిగిన ఇంధన ధరలు ఎవరికి లాభం చేకూర్చాయని ఆలోచిస్తే.. చమురు కంపెనీలకని చెప్పుకోక తప్పదు. అవును నిజమే.. ఈ కారణంగా ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) మంచి లాభాలను ఆర్జించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ లో కంపెనీ నికర లాభం ఏకంగా 31.5 శాతం పెరిగింది. పెరిగిన లాభాలకు పెరిగిన చమురు ధరలు గణనీయంగా దోహదపడ్డాయి. 2022 జనవరి-మార్చి క్వార్టర్ లో కంపెనీ నికర లాభం రూ. 8,859.54 కోట్లుగా ఉందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపిన వివరాల్లో ONGC వెల్లడించింది.

కంపెనీ నిర్వహణ ఆదాయం కూడా ఈ క్వార్టర్ లో రూ.21,188.91 కోట్ల నుంచి రూ.34,497.24 కోట్లకు పెరిగింది. మొత్తం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ONGC రికార్డు స్థాయిలో రూ. 40,305.74 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దీని నికర లాభం రూ.11,246.44 కోట్లుగా ఉంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడమే కంపెనీ లాభాల్లో బలమైన పెరుగుదలకు కారణమైంది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత ముడి చమురు మరింత ప్రియంగా మారింది. ONGC ఏకీకృత నికర లాభం మార్చి క్వార్టర్ లో రూ. 12,061.44 కోట్లుగా ఉంది. ఇది పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 49,294.06 కోట్లుగా ఉంది.