AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger Stock: కేవలం ఐదు నెలల్లో లక్షను.. రూ.18.60 లక్షలుగా మార్చిన షేర్.. మీరు కూడా ఇన్వెస్ట్ చేశారా..?

Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం అనేది కొంత రిస్క్ తో కూడుకున్న అంశమే. కొన్ని కంపెనీల షేర్లు అధిక రిటర్న్స్ ఇస్తే.. మరికొన్ని మాత్రం ఇన్వెస్టర్లకు ఊహించని నష్టాలను కలిగిస్తుంటాయి.

Multibagger Stock: కేవలం ఐదు నెలల్లో లక్షను.. రూ.18.60 లక్షలుగా మార్చిన షేర్.. మీరు కూడా ఇన్వెస్ట్ చేశారా..?
Multibagger Stocks
Ayyappa Mamidi
|

Updated on: May 29, 2022 | 4:28 PM

Share

Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం అనేది కొంత రిస్క్ తో కూడుకున్న అంశమే. కొన్ని కంపెనీల షేర్లు అధిక రిటర్న్స్ ఇస్తే.. మరికొన్ని మాత్రం ఇన్వెస్టర్లకు ఊహించని నష్టాలను కలిగిస్తుంటాయి. కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్స్ మాత్రం సామాన్యులను అనతి కాలంలోనే కోటీశ్వరులను చేస్తుంటాయి. ఇన్వెసర్ల అంచనాలకు మించి ర్యాలీ చేసి వాళ్లను ధనవంతులను చేస్తుంటాయి. స్టాక్ మార్కెట్లలో కరెక్షన్ల మధ్య కూడా కొన్ని కంపెనీల స్టాక్స్ విపరీతమైన రాబడులను ఇస్తున్నాయి. ఆ కోవకు చెందినదే సెజల్ గ్లాస్ లిమిటెడ్ స్టాక్ కూడా. ఈ షేర్ కేవలం ఐదు నెలల కాలంలో ఇన్వెస్టర్ల తలరాతను మార్చేసిందని చెప్పుకోవాలి.

ఈ షేర్ విలువ గత 6 నెలల కాలంలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, బీఎస్‌ఈ సెన్సెక్స్ లలో ఎగబాకింది. దీని కారణంగా కేవలం ఐదు నెలల్లోనే ఇన్వెస్టర్లకు 1760% రాబడి వచ్చింది. వివిధ రకాల గ్లాస్ తయారు చేయటంలో సెజల్ గ్లాస్ లిమిటెడ్ తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. బీఎస్‌ఈలో స్మాల్ క్యాప్ కంపెనీ సెజల్ గ్లాస్ షేర్ ధర డిసెంబర్ 13, 2021న కేవలం రూ.13.65గా ఉంది. పెన్నీ స్టాక్ గా ఉన్న ఈ కంపెనీ షేర్ విలువ మే 13, 2022 నాటికి రూ.254కి చేరుకుంది. ఆ విధంగా షేర్ కేవలం 5 నెలల్లోనే 1,760.81% రాబడిని అందించి మల్టీబ్యాగర్ స్టాక్‌గా మారింది. దీని ప్రకారం డిసెంబర్ నెలలో కంపెనీలో రూ.లక్ష విలువైన షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు.. ఇప్పుడు రూ.18.60 లక్షలు పొందుతారు. సెజల్ గ్లాస్ షేర్‌ 52 వారాల గరిష్ఠమైన రూ. 517.45ను 5 ఏప్రిల్ 2022న తాకింది. షేర్ గరిష్ఠాన్ని తాకినప్పుడు అమ్మిన వారికి ఇప్పుడు వచ్చే లాభం రెండితలకు చేరుకునేంది.

NOTE: ఇక్కడ అందిస్తున్న ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆర్ధిక నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలు.. ఆయా కంపెనీల పనితీరుపై నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ అందిస్తున్నాం. స్టాక్స్, ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.

కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!