Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పులి పంజావిసురుతోంది..సీసీ ఫుటేజీలో షాకింగ్‌ సీన్లు, వైజాగ్‌ నుండి రంగంలోకి స్పెషల్‌ టీమ్‌, బోన్లు..

అక్కడి జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న పులికోసం వెతుకులాట ముమ్మరం చేశారు పోలీసులు, అటవీశాఖ అధికారులు. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి, పోతులూరు గ్రామాల్లో హడలెత్తిస్తున్న పెద్దపులి గత పదిరోజులుగా చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

పులి పంజావిసురుతోంది..సీసీ ఫుటేజీలో షాకింగ్‌ సీన్లు, వైజాగ్‌ నుండి రంగంలోకి స్పెషల్‌ టీమ్‌, బోన్లు..
Tiger
Follow us
Jyothi Gadda

|

Updated on: May 30, 2022 | 9:26 AM

అక్కడి జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న పులికోసం వెతుకులాట ముమ్మరం చేశారు పోలీసులు, అటవీశాఖ అధికారులు. కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి, పోతులూరు గ్రామాల్లో హడలెత్తిస్తున్న పెద్దపులి గత పదిరోజులుగా చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రత్తిపాడు పరిసరాల్లో పులి సంచారం సీసీటీవీ పుటేజీల్లో రికార్డైంది. కాకినాడ జిల్లాలోని పోతులూరు వద్ద పశువులను పులి చంపేసింది. పులి సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు. మూడు రోజుల క్రితం చంపిన గేదె ను తినేందుకు వచ్చిన పెద్ద పులి ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు చిక్కింది.

కాకినాడ గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామ సమీపంలో సంచరిస్తున్న పులిని పట్టుకునేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక కార్యాచరణను సిద్దం చేశారు. పులిని పట్టుకునేందుకు 120 మంది అటవీ అధికారులతో సహా నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ఆదివారం తెల్లవారుజామున 2.13 గంటలకు పులి తాజా దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కొడవలి, గొల్లప్రోలు గ్రామాల మధ్య ఉన్న కొండలపై పులి సంచారిస్తున్నట్టు తెలిసింది. దీంతో కొడవలి, చింతలూరు గ్రామాల్లో దాదాపు 40 చోట్ల అధికారులు కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు. వెటర్నరీ డాక్టర్‌ను కూడా నియమించారు. ”గతంలో ముమ్మిడివరం మండలంలో అటవీశాఖ అధికారులు చిరుతను సజీవంగా పట్టుకున్నారు. పులిని పట్టుకునేందుకు కూడా అదే టెక్నిక్‌ను అవలంబిస్తామన్నారు డీఎఫ్‌వో ఐకేవీ రాజు టీఎన్‌ఐఈకి తెలిపారు.

ప్రస్తుతం కొడవలి-పోతులూరు వద్ద పంపు షెడ్ పక్కన ఉదార మేట్టా పై నక్కి ఉన్న పులిని గుర్తించారు. ఒరిస్సా బోర్డర్ చింతూరు కాకర పాడు మీదుగా పులి వచ్చినట్లుగా ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పులిగా ఫారెస్ట్ అధికారులు నిర్ధారించటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలో పడ్డారు. రాత్రిపూట పశువులపై దాడి చేస్తున్నట్టు గుర్తించిన అధికారులు..రాత్రుళ్లు..ఎవరూ, బయటకు తిరగ వద్దని హెచ్చరించారు. పులిని బంధించేందుకు వైజాగ్ నుండి బోన్లతో స్పెషల్ టిమ్‌ని రప్పిస్తున్నారు. చీఫ్ అటవీ అధికారి శరవనన్ ఆధ్వర్యంలో అటవీ అధికారుల పర్యవేక్షణలో ఈ టైగర్‌ సర్చింగ్‌ కొనసాగుతోంది.