AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టిఫిన్ బాక్స్‌తో ముంబై ట్రైన్ ఎక్కాడు.. కట్ చేస్తే.. రూ.42 వేల కోట్ల సామ్రాజ్యంతో మరో అంబానీ అయ్యాడు..

Anil Agarwal: చాలామంది ఓటమిని చూసి భయపడి ఆగిపోతారు, కానీ ఆయన మాత్రం తొమ్మిదిసార్లు విఫలమైనా పట్టువదలని విక్రమార్కుడిలా పదో ప్రయత్నంలో ప్రపంచాన్ని జయించాడు. బిహార్‌లోని పాట్నా వీధుల్లో తండ్రి చిన్న వ్యాపారాన్ని చూస్తూ పెరిగిన ఆ యువకుడు.. చేతిలో కేవలం ఒక టిఫిన్ బాక్స్, కోట్ల కలలతో ముంబైలో అడుగుపెట్టి అతిపెద్ద సామ్రాజ్యాన్నే నిర్మించాడు.

టిఫిన్ బాక్స్‌తో ముంబై ట్రైన్ ఎక్కాడు.. కట్ చేస్తే.. రూ.42 వేల కోట్ల సామ్రాజ్యంతో మరో అంబానీ అయ్యాడు..
Vedanta Chairman Anil Agarwal Success Story
Krishna S
|

Updated on: Mar 04, 2026 | 12:16 PM

Share

ఆకాశమే హద్దుగా ఎదగాలంటే ఆస్తులు అక్కర్లేదు, గుండె నిండా ఆశయం ఉంటే చాలని నిరూపించిన వ్యక్తి అనిల్ అగర్వాల్. ఒక సాదాసీదా స్క్రాప్ వ్యాపారి నుంచి ప్రపంచ దేశాలు గర్వించే వేదాంత సామ్రాజ్య అధినేతగా ఆయన ఎదిగిన తీరు ప్రతీ యువతకు ఒక గైడ్ బుక్ లాంటిది. నేడు రూ.42,396 కోట్ల సంపదతో అల్యూమినియం, రాగి, జింక్ రంగాల్లో ప్రపంచాన్ని శాసిస్తున్నారు. 954లో బిహార్‌లోని పాట్నాలో ఒక మధ్యతరగతి మార్వారీ కుటుంబంలో అనిల్ అగర్వాల్ జన్మించారు. 19 ఏళ్ల వయసులో జీవితంలో ఏదో సాధించాలనే తపనతో ముంబై రైలెక్కినప్పుడు ఆయన వద్ద ఉన్నది కేవలం ఒక మంచం, లంచ్ బాక్స్ మాత్రమే. ఎవరి అండదండలు లేని ఆ మహానగరంలో అగర్వాల్ తన ప్రయాణాన్ని అట్టడుగు స్థాయి నుండి ప్రారంభించారు.

9 వ్యాపారాల్లో ఫెయిల్.. కానీ..

ముంబై వీధుల్లో తిరుగుతూ ఆయన మొదట స్క్రాప్ సేకరించే వ్యాపారం చేశారు. ఏ బిజినెస్ స్కూల్లో చదవని పాఠాలను ఆయన ఆ స్క్రాప్ యార్డుల్లో నేర్చుకున్నారు. ధరల బేరసారాలు, వస్తువుల డిమాండ్, నగదు ప్రవాహాన్ని మేనేజ్ చేయడం వంటివి ఆయనకు ఇక్కడే వంటపట్టాయి. రిస్క్ తీసుకోవడం ఆయన రక్తంలోనే ఉందని అప్పుడే అర్థమైంది. చాలామంది ఒకసారి ఓడిపోతేనే కుంగిపోతారు. కానీ అగర్వాల్ అసాధారణ వ్యక్తి. ఆయన ప్రారంభించిన మొదటి 10 వ్యాపారాల్లో 9 దారుణంగా దెబ్బతిన్నాయి. కానీ ఆ ఓటములే ఆయనను రాటుదేల్చాయి. సమయం, గట్టి పట్టుదల ఉంటే ప్రపంచాన్ని జయించొచ్చు అనే సిద్ధాంతాన్ని ఆయన అప్పుడే నమ్మారు. ఆ మొండితనం నుండే 1986లో స్టెర్లైట్ ఇండస్ట్రీస్ పురుడుపోసుకుంది.

లోహ సామ్రాజ్య స్థాపన

మొదట్లో రాగిని కొనుగోలు చేసే అగర్వాల్.. లాభాలు పెరగాలంటే దానిని సొంతంగా ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నారు. 1993లో భారత్‌లోనే తొలి ప్రైవేట్ రంగ రాగి స్మెల్టర్‌ను స్థాపించి దిగ్గజాలను విస్మయానికి గురిచేశారు. ప్రభుత్వ రంగ సంస్థలైన BALCO, హిందూస్తాన్ జింక్‌లో మెజారిటీ వాటాలను దక్కించుకుని దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రధారిగా మారారు. 2003లో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో వేదాంత రిసోర్సెస్‌ను లిస్ట్ చేయడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారత జెండాను ఎగరవేశారు.

ప్రస్తుతం ఆయన తన సామ్రాజ్యాన్ని మరింత వికేంద్రీకరిస్తూ విభజన, వైవిధ్యీకరణ, రుణ తగ్గింపు అనే 3D ఫార్ములాతో ముందుకు వెళ్తున్నారు. అల్యూమినియం, ఆయిల్, పవర్ ఇలా ప్రతి రంగాన్ని ఒక స్వతంత్ర శక్తిగా మారుస్తున్నారు. స్క్రాప్ డీలర్ నుంచి బిలియనీర్ వరకు సాగిన ఆయన ప్రస్థానంలో ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు ఉన్నాయి. కానీ వాటన్నింటినీ తన విజయంతో తుడిచిపెట్టేశారు అనిల్ అగర్వాల్. సంపద సృష్టించడమే కాదు, దాతృత్వంలోనూ ఆయన ముందే ఉంటారు.

Follow Us
టిఫిన్ బాక్స్‌తో ముంబై ట్రైన్ ఎక్కాడు.. కట్ చేస్తే.. రూ.42 వేల..
టిఫిన్ బాక్స్‌తో ముంబై ట్రైన్ ఎక్కాడు.. కట్ చేస్తే.. రూ.42 వేల..
ఇదెక్కడి మాస్ రా మావా.. చిరుతతో సరదాగా హోలీ ఆడిన ఊరి జనం.. వీడియో
ఇదెక్కడి మాస్ రా మావా.. చిరుతతో సరదాగా హోలీ ఆడిన ఊరి జనం.. వీడియో
రేయ్ ఎంత దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..
రేయ్ ఎంత దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..
విజయ్ విడాకుల విషయంలో వేణు స్వామి సంచలన కామెంట్స్..
విజయ్ విడాకుల విషయంలో వేణు స్వామి సంచలన కామెంట్స్..
చిన్నస్వామి గడ్డపై మళ్ళీ కోహ్లీ గర్జన..ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు పండుగ
చిన్నస్వామి గడ్డపై మళ్ళీ కోహ్లీ గర్జన..ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు పండుగ
నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం..
నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం..
టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం..
టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం..
క్వీన్ ఎలిజబెత్ రాసిన లేఖ.. భారీ ధరకు వేలం..మ్యాటర్‌ ఏంటంటే..
క్వీన్ ఎలిజబెత్ రాసిన లేఖ.. భారీ ధరకు వేలం..మ్యాటర్‌ ఏంటంటే..
వంకాయ, టమాటా రోటి పచ్చడి ఇలా చేస్తే.. క్యాన్సర్‎ను తరిమికొడుతుంది
వంకాయ, టమాటా రోటి పచ్చడి ఇలా చేస్తే.. క్యాన్సర్‎ను తరిమికొడుతుంది
కన్నతల్లి కిరాతకం.. 2 నెలల బాబును నీటిలో ముంచి దారుణం.. చివరకు..
కన్నతల్లి కిరాతకం.. 2 నెలల బాబును నీటిలో ముంచి దారుణం.. చివరకు..