PM Cares Scheme: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆర్ధిక సాయం.. పీఎం సహాయ నిధి రిలీజ్ చేసిన ప్రధాని మోడీ
PM Cares Children Scheme: కరోనా బారిన పడి.. తల్లిదండ్రులను, తమ సంరక్షకులను ఎందరో పిల్లలు కోల్పోయారు. అనాథలుగా మారారు. అయితే ఇలాంటి బాధిత చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. "ప్రధాన మంత్రిసహాయ నిధి" (PM Cares Funds ) నుంచి ప్రధాని మోడీ ఆర్ధిక సాయం అందించడానికి సంకల్పించారు.
PM Narendra Modi: నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి 8 ఏళ్లు ముగిసింది. ఈ ఎనిమిదేళ్ల పాలనలో దేశ రక్షణ, సంక్షేమ పథకాలు, డిజిటల్ ఇండియా వైపుగా దేశం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే కరోనా బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం మోదీ సర్కార్ ‘పీఎం కేర్స్ ఫండ్స్’ ప్రారంభించింది. ఆ అంశంపై ఓ లుక్కేద్దాం.
మానవాళి జీవితాన్ని కరోనాకి ముందు తర్వాతగా చెప్పుకోవచ్చు. రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టించింది. కోట్లాది మంది ప్రజలు కోవిడ్ కోరల్లో చిక్కుకుని శారీరకంగా, ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లక్షలాది మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. తమ ప్రియమైన కుటుంబ సభ్యులను, స్నేహితులను, హితులను కోల్పోయారు. మన దేశంలోనూ కరోనా బారిన పడి.. తల్లిదండ్రులను, తమ సంరక్షకులను ఎందరో పిల్లలు కోల్పోయారు. అనాథలుగా మారారు. అయితే ఇలాంటి బాధిత చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తల్లిదండ్రులను అయినవారిని కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు “ప్రధాన మంత్రిసహాయ నిధి” (PM Cares Funds ) నుంచి ప్రధాని మోడీ ఆర్ధిక సాయం అందించడానికి సంకల్పించారు. దీంతో నేటి (సోమవారం) నుంచి కరోనా బాధిత చిన్నారులకు ఆర్థికంగా సహాయాన్ని అందించనున్నారు.
పిల్లల కోసం PM కేర్స్ పథకం అంటే ఏమిటి?
ఈ పథకంలో భాగంగా.. 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్య కాలంలో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను, సంరక్షుకులను, ఒంటరి తల్లి, తండ్రిని కోల్పోయిన పిల్లలకు పీఎం కేర్స్ నుంచి ఈ సహాయం అందించనున్నారు. PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్‌ను మే 29, 2021న ప్రారంభించారు. పాఠశాలకు వెళ్లే అర్హులైన పిల్లలకు స్కాలర్ షిప్స్, ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద హెల్త్ కార్డ్‌లు, పీఎం కేర్ పాస్ బుక్స్ అందిస్తున్నారు.
PM కేర్స్ పథకం లక్ష్యం ఏమిటంటే..
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ లక్ష్యం పిల్లల సమగ్ర సంరక్షణ, స్థిరమైన పద్ధతి రక్షణ లో అందించడమే. ఈ పథకం బాధిత చిన్నారులకు బోర్డింగ్, బసను అందిస్తుంది. విద్య, స్కాలర్‌షిప్‌ల ద్వారా వారి భవిష్యత్ ను అందించనుంది. బాధిత పిల్లలకు 18 ఏళ్ళు నిండే వరకు వారి పేరిట రూ.10 లక్షల సొమ్ము బ్యాంకులో ఉండేలా ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది. 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో కేంద్రం డిపాజిట్ చేసిన నగదుపై వచ్చిన వడ్డీని బాధిత పిల్లలకు ఆర్ధిక సాయం అందిస్తారు. 23 ఏళ్ళు నిండిన అనంతరం డిపాజిట్ చేసిన పది లక్షలను పూర్తిగా బాధితులకు ఇస్తారు.
PM కేర్స్ పథకం కోసం పిల్లలు ఎలా నమోదు చేసుకోవాలంటే?
ఇప్పటికే దీనికి సంబందించిన ప్రక్రియ పూర్తి కాగా..సోమవారం ప్రధాని మోడీ ఈ ఆర్ధిక సహాయ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాధిత పిల్లలు తమ వివరాలు నమోదు చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. పిల్లల నమోదు కోసం ఆన్ లైన్ లో పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ అనేది పిల్లల కోసం నమోదు ప్రక్రియ, అన్ని ఇతర సహాయ కార్యక్రమాలను సులభతరం చేసే సింగిల్ విండో సిస్టమ్.
At 10:30 AM tomorrow, 30th May would be releasing benefits under the PM CARES for children scheme. Through this effort, we are supporting those who lost their parents to COVID-19. https://t.co/cZ8aIDUe2P
— Narendra Modi (@narendramodi) May 29, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..