Overweight: బరువు పెరుగుతున్న భారతీయులు.. మేల్కోకపోతే రోగాలపాలే..

Overweight: దేశంలో గత కొన్ని సంవత్సరాలలో స్థూలకాయం సమస్య ఎదుర్కొంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనికి త్వరితగతిన పరిష్కారం కనుక్కోకపోతే పరిస్థితులు అధ్వాన్నంగా మారే ప్రమాదం ఉంది.

Overweight: బరువు పెరుగుతున్న భారతీయులు.. మేల్కోకపోతే రోగాలపాలే..
Weightloss
Follow us

|

Updated on: May 30, 2022 | 11:58 AM

Overweight: దేశంలో గత కొన్ని సంవత్సరాలలో స్థూలకాయం సమస్య ఎదుర్కొంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనికి త్వరితగతిన పరిష్కారం కనుక్కోకపోతే పరిస్థితులు అధ్వాన్నంగా మారే ప్రమాదం ఉంది. 2016 అంచనా ప్రకారం.. 135 మిలియన్ల మంది భారతీయులు అధిక బరువు లేదా ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సంఖ్య దేశంలోని పురుషుల్లో 23% ఉండగా.. స్త్రీలలో 24%కి పెరిగింది. 2015-16లో 2.1%తో పోలిస్తే.. ఇప్పుడు ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో 3.4% మంది అధిక బరువుతో ఉన్నారని తేలింది.

స్థూలకాయాన్ని సూచించడానికి ఉద్దేశించిన బాడీ మాస్ ఇండెక్స్ పరిమితి 25 అనేది దక్షిణాసియా జనాభాకు వర్తించదని నిపుణులు భావిస్తున్నారు. భారతీయులు ఎక్కువగా పొట్ట కలగి ఉంటారు. దీనిని సెంట్రల్ ఒబిసిటీ అని అంటారు. ఈ లెక్కన 23 బీఎమ్ఐ ఉన్న వ్యక్తులను సైతం అధిక బరువు ఉన్న వారిగా పరిగణించాల్సి వస్తుంది. ఇలా గనుక లెక్కించటం ప్రారంభిస్తే దేశంలో దాదాపుగా సగానికి పైగా జనాభా స్థూలకాయం ఎదుర్కొంటున్న వారి జాబితాలోకి వస్తారు. దేశంలో పట్టణీకరణ పెరగటం.. చౌకగా, కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినటం, జీవనశైలిలో మార్పులు కారణంగా ఎక్కువ మంది అధిక బరువు సమస్య భారిన పడుతున్నారు.

WHO ప్రకారం.. ఆన్‌లైన్ ఫుడ్ యాప్‌లు కూడా ఊబకాయం పెరిగేందుకు కారణంగా నిలుస్తోంది. ఎందుకంటే.. జంక్ ఫుడ్ డెలివరీ, వినియోగాన్ని గతంలో కంటే సులభతరం చేయటమే ఇందుకు కారణం. అంతేకాకుండా భారతీయులు పోషకాహార లోపంపై దృష్టి సారించే సమయంలో బరువు పెరుగుదలను గమనించటం లేదని తెలుస్తోంది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (GBD) అధ్యయనం ప్రకారం 2019లో స్థూలకాయం కారణంగా 5.02 మిలియన్ల మంది అకాల మరణం చెందారని తేలింది. సంవత్సరం మొత్తం మరణాల్లో 8% మంది ఈ కారణంతోనే మరణించారు. కొంతమంది వైద్యుల అభిప్రాయం ప్రకారం.. 10 కిలోల అదనపు బరువు ఒక వక్తి జీవిత కాలాన్ని మూడు సంవత్సరాలు తగ్గిస్తుందని అంటున్నారు. శరీరంలోని అధిక కొవ్వు వల్ల 13 రకాల క్యాన్సర్లు, టైప్-2 డయాబెటిస్, గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలతో సహా నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని తెలుస్తోంది.