AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cosmetic Surgeries: కాస్మోటిక్ సర్జరీ సురక్షితమేనా.. నిపుణులు ఏమంటున్నారంటే

స్త్రీలను ఈ సృష్టిలో అందమైన వారిగా కవులు, రచయితలు పోలుస్తుంటారు. సహజసిద్ధంగానే మహిళలు అందంగా ఉంటారు. అయితే కొంత మంది తాము అందంగా లేమని ఆత్మన్యూనత భావానికి లోనై కుంగిపోతుంటారు. అలాంటి వారు...

Cosmetic Surgeries: కాస్మోటిక్ సర్జరీ సురక్షితమేనా.. నిపుణులు ఏమంటున్నారంటే
Cosmetic Surgery
Ganesh Mudavath
|

Updated on: May 30, 2022 | 11:58 AM

Share

స్త్రీలను ఈ సృష్టిలో అందమైన వారిగా కవులు, రచయితలు పోలుస్తుంటారు. సహజసిద్ధంగానే మహిళలు అందంగా ఉంటారు. అయితే కొంత మంది తాము అందంగా లేమని ఆత్మన్యూనత భావానికి లోనై కుంగిపోతుంటారు. అలాంటి వారు తమ అందాన్ని పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో కాస్మోటిక్ సర్జరీ(Cosmetic Surgery) వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే సర్జరీని చేయించుకోవడం ఎంత వరకు సరైనది, దాని వెనుక నెగిటివ్ బాడీ ఇమేజ్(Negative Body Image) దాగి ఉందా? ఇది ఆరోగ్యానికి సురక్షితమేనా అనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్నగా మారింది. ఈ అంశంపై చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ కిరణ్ లోహియాను సంప్రదించగా.. కాస్మోటిక్ సర్జరీతో ఎటువంటి అనారోగ్యం కలగదని చెప్పారు. కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే చర్మం ఇన్ఫెక్షన్, దురదకు గురయ్యే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ మహళ.. తన ముఖం మునుపటిలా లేదని భావించి సర్జరీ చేయించుకున్నారు. దురదృష్టవశాత్తు ఆమెకు మంచి జరగకపోగా.. నష్టం మరింత ఎక్కువైంది.

డిసెంబర్ 2020లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం సంవత్సరానికి మూడు మిలియన్ ఇంజెక్షన్‌లతో, బొటాక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే అత్యంత సాధారణ కాస్మోటిక్ ప్రక్రియ. దీని ప్రభావం మూడు నుంచి ఆరు నెలల వరకు ఉంటుంది. బొటాక్స్ సహాయంతో, నుదిటిపై, కళ్ల చుట్టూ, నోరు, గడ్డం వద్ద ముడతలను తొలగించవచ్చు.బొటాక్స్ 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. అయితే 18 ఏళ్లు పై బడిన వారిలో అధిక చెమటను నివారించడానికి బొటాక్స్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అన్ని సర్జరీల మాదిరిగానే బొటాక్స్‌కూ ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని డాక్టర్ లోహియా చెప్పారు.

అంతేకాకుండా.. బ్లీచింగ్ ఫేషియల్ వల్ల చర్మంపై వాపు వస్తుందని చాలా అధ్యయనాల్లో తేలింది. చర్మంపై కొన్ని హానికరమైన పదార్ధాలు చేరడం వల్ల కొన్నిసార్లు రియాక్షన్ వస్తుంది. ముక్కు ఆకృతి, కనురెప్పల సర్జరీ, ఫేస్‌లిఫ్ట్, రొమ్ము సర్జరీ, లైపోసక్షన్ కోసం అధికంగా మహిళలు ప్రయత్నిస్తున్నారని ఓ నివేదికలో తేలింది. ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న వ్యక్తులు ఉండటం లేదా వారి లేకపోవడంపై వారు చేసిన వ్యాఖ్యల కారణంగా తాము అందంగా లేమన్న ఆలోచనలు వస్తాయని కామ్నా ఛిబ్బర్ వివరించారు. ఇలా చేసే స్త్రీలందరూ బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్‌తో బాధపడరని చెప్పారు.

ఇవి కూడా చదవండి

అయితే వారు తమ శరీరాకృతిపై ప్రతికూల భావనను ఏర్పరచుకుంటారని అన్నారు. వారి ఇబ్బందిని చుట్టుపక్కలా ఉన్న వారు సాధారణంగా భావించవచ్చు. కానీ ఆ సమస్యతో సతమతమవుతున్న వ్యక్తి మాత్రం తనకు తాను చాలా ఇబ్బందిగా ఆందోళన చెందుతాడు. కాబట్టి వారిలో మానసిక ధైర్యం అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.