Indian Railways రైల్వే ఉద్యోగ అభ్యర్థులను అప్రమత్తం చేసిన ఇండియన్ రైల్వే శాఖ.. ఎందుకంటే..
Indian Railways Jobs: ప్రస్తుతం అన్ని రంగాల్లో మోసాలు జరుగుతున్నాయి. అమాయకులను ఆసరా చేసుకునే కేటుగాళ్లు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నట్టేట ముంచుతున్నారు. రైల్వే ఉద్యోగాల పేరుతో భారీ..
Indian Railway Jobes Fraudsters: ప్రస్తుతం అన్ని రంగాల్లో మోసాలు జరుగుతున్నాయి. అమాయకులను ఆసరా చేసుకునే కేటుగాళ్లు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నట్టేట ముంచుతున్నారు. రైల్వే ఉద్యోగాల పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఇక భారతీయ రైల్వేలోని వివిధ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయక ఉద్యోగ ఆశావహులను కొందరు మోసగాళ్లు మోసగిస్తున్న ఘటనలు మా దృష్టికి వచ్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. రైల్వేలో ఉద్యోగాలు ఆర్‌ఆర్‌బీ, ఆర్‌ఆర్‌సీ ద్వారా ఉద్యోగ ప్రకటనలు ప్రచురించిన తర్వాత నిర్వహించే పరీక్షలలో ఉత్తీర్ణులయిన అభ్యర్థులను మాత్రమే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
అయితే రైల్వే ఉద్యోగాలు ఆశించే అభ్యర్థులు డబ్బుకు ఆశపడి మోసగించే ఇటువంటి నేరగాళ్లను ఆశ్రయించవద్దని హెచ్చరించారు. ఉద్యోగాలకు సంబంధించిన సరైన సమాచారమంతా ఎప్పటికప్పుడు ఆర్‌ఆర్‌బీ/ఆర్‌ఆర్‌సీ/ఎస్‌సీఆర్ వైబ్‌సైట్లలో తెలియజేస్తామని, ఈ నియామకాలలో ఎటువంటి మధ్యవర్తిత్వాలకు అవకాశాలు ఉండవని స్పష్టం చేస్తున్నారు అధికారులు. రైల్వే ఉద్యోగం నేరుగా పొందడానికి ఎలాంటి దగ్గర దారులు ఉండవని గమనించాలని రైల్వే శాఖ తెలిపింది. ఇటువంటి మోసాలకు పాల్పడేవారి బారిన పడవద్దని, వారిని నమ్మి మోసపోవద్దని సాధారణ ప్రజలకు సూచించిస్తోంది.
రైల్వేలో అన్ని ఉద్యోగాల నియామకాలను పారదర్శక పద్థతిలో ఆర్‌ఆర్‌బి / ఆర్‌ఆర్‌సి ద్వారా మాత్రమే నిర్వహిస్తారని ఇన్‌చార్జి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. మోసగించే దళారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి