PM Modi: ఇజ్రాయెల్ ప్రధానితో మోదీ కీలక చర్చ.. యుద్ధపరిణామాలపై ఆరా.. ఉద్రిక్తతల తగ్గింపునకు సూచన
పశ్చిమాసియాలో ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి కీలక చర్చలు జరిపారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌లతో ఆయన ప్రత్యేకంగా టెలిఫోన్‌లో మాట్లాడారు. ఉద్రిక్త పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, శత్రుత్వాలను వెంటనే నిలిపివేసి, సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.

పశ్చిమాసియాలో వేగంగా మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అత్యున్నత స్థాయి టెలిఫోన్ సంభాషణ జరిపారు. ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ హత్య నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులు, ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడుల నేపథ్యంలో ఈ చర్చ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చర్చపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ప్రాంతీయ పరిస్థితులను వివరంగా చర్చించామని తెలిపారు. “ఇటీవలి పరిణామాలపై భారత ఆందోళనలను నెతన్యాహుకు తెలియజేశాను. పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. శత్రుత్వాలను త్వరగా నిలిపివేయాల్సిన అవసరం ఉంది” అని మోదీ స్పష్టం చేశారు.
Had a telephone call with PM Benjamin Netanyahu to discuss the current regional situation. Conveyed India’s concerns over recent developments and emphasised the safety of civilians as a priority. India reiterates the need for an early cessation of hostilities.@netanyahu
— Narendra Modi (@narendramodi) March 1, 2026
యూఏఈకి భారత్ మద్దతు
ఆ తర్వాత ప్రధాని మోదీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మాట్లాడారు. గల్ఫ్ దేశంపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ క్లిష్ట సమయంలో భారత్ యూఏఈకి పూర్తి సంఘీభావంగా ఉంటుందని మోదీ హామీ ఇచ్చారు. అంతేకాకుండా యూఏఈలో నివసిస్తున్న భారతీయ సమాజం భద్రతకు హామీచ ఇచ్చినందుకు యూఏఈ అధ్యక్షుడికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్రిక్తతల తగ్గింపు, ప్రాంతీయ శాంతి, భద్రత మరియు స్థిరత్వానికి భారతదేశం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
Spoke with President of the UAE, my brother Sheikh Mohamed bin Zayed Al Nahyan. Strongly condemned the attacks on the UAE and condoled the loss of lives in these attacks. India stands in solidarity with the UAE in these difficult times.
Thanked him for taking care of the Indian…
— Narendra Modi (@narendramodi) March 1, 2026
