Tomato Price: పరుగులు పెడుతున్న టమాట ధర.. కిలో 100 రూపాయలు.. ఎక్కడంటే..!
Tomato Price: సామాన్యులకు టమాట ధర చుక్కలు చూపిస్తోంది. జూన్ మొదటి వారంలో టమాట ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు ముంబైలోని పరుగులు పెడుతోంది. కిలోకు రూ.100 ధర పలుకుతోంది..
Tomato Price: సామాన్యులకు టమాట ధర చుక్కలు చూపిస్తోంది. జూన్ మొదటి వారంలో టమాట ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు ముంబైలోని పరుగులు పెడుతోంది. కిలోకు రూ.100 ధర పలుకుతోంది. దీంతో ముంబై వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మనీ కంట్రోల్ వివరాల ప్రకారం.. జూన్ 3 న ముంబైలోని దాదర్ కూరగాయల మార్కెట్‌లో టమాట కిలో 80 రూపాయలు ఉండగా, మిగిలిన నగరంలోని ధర 100 రూపాయల స్థాయికి చేరుకుంది. ముంబై, చెన్నైలలో టమాటాలతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో కేవలం 4 చోట్ల మాత్రమే టమోటా 100 స్థాయికి మించి ఉంది. ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో మాత్రమే టమాటా తక్కువగా ఉంది. ముంబైతో పోలిస్తే ఢిల్లీలో ధరలు తక్కువగా ఉన్నాయి. మారుతున్న వాతావరణమే టమోటా ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అదే సమయంలో రాబోయే 2 వారాల్లో టమోటాల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
గత నెలలో దేశంలో టమోటా సగటు ధర 70 శాతం పెరిగి కిలో రూ. 54 స్థాయికి చేరుకుంది. గత ఏడాది కాలంలో ఇది 168 శాతం పెరిగింది. మరోవైపు ఢిల్లీ మినహా దేశవ్యాప్తంగా టమాట ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో టమాటా ధరలు కిలో రూ.50 లోపే ఉన్నాయి. అదే సమయంలో చెన్నై, కోల్‌కతాలో టమాట ధరలు కిలో రూ.60 నుంచి 80 వరకు ఉన్నాయి. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇది టమోటాల సరఫరాను ప్రభావితం చేసింది. గత నెల రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో టమాట ధరలు రెండింతలు పెరిగాయి.
రెండు వారాల్లో ధరలు తగ్గుతాయి
టమాట ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయన్న నివేదికల తర్వాత.. దక్షిణ భారత రాష్ట్రాల్లో ధరలు పెరగడం.. మరో రెండు వారాల్లో తగ్గుతుందని అంచనా ఉంది. ఈ ప్రాంతాల్లో రుతుపవనాల ముందు వర్షాలు పంటలను ప్రభావితం చేశాయని, దాని కారణంగా ధరలు పెరిగాయి. దేశంలో టమాటా ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం పడలేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి