Aether Industries IPO: లాభాలు తెచ్చిన ఏథర్ ఇండస్ట్రీస్.. 10 శాతం ప్రీమియంతో లిస్ట్ అయి 21 శాతం పెరిగిన స్టాక్..
స్పెషాలిటీ కెమికల్ మేకర్ ఏథర్ ఇండస్ట్రీస్ స్టాక్ మార్కెట్‌లో శుభారంభం చేసింది . ఏథర్ ఇండస్ట్రీస్ షేర్ బిఎస్‌ఇలో 10 శాతం ప్రీమియంతో రూ.706.15 వద్ద లిస్ట్ అయింది...
స్పెషాలిటీ కెమికల్ మేకర్ ఏథర్ ఇండస్ట్రీస్ స్టాక్ మార్కెట్‌లో శుభారంభం చేసింది . ఏథర్ ఇండస్ట్రీస్ షేర్ బిఎస్‌ఇలో 10 శాతం ప్రీమియంతో రూ.706.15 వద్ద లిస్ట్ అయింది. కాగా ఎన్‌ఎస్‌ఈలో స్టాక్ లిస్టింగ్ 9.66 శాతం ప్రీమియంతో రూ.704 స్థాయిలో జరిగింది. IPO ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.642. బీఎస్‌ఈలో ఈ షేరు 21 శాతం పెరిగి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ.776.75కి చేరుకుంది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.808.04 కోట్లు సమీకరించింది. గుజరాత్ కెమికల్ కంపెనీ అ ప్రత్యేక రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇష్యూలో 50 శాతం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ కొనుగోలుదారుల (QIBలు) కోసం రిజర్వ్ చేశారు. రిటైల్ ఇన్వెస్టర్లు, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు వరుసగా 35 శాతం మరియు 15 శాతం రిజర్వ్ చేశారు. పబ్లిక్ ఆఫర్‌లో రూ. 627 కోట్ల తాజా ఇష్యూ, రూ. 181 కోట్ల అమ్మకానికి ఆఫర్ ఉన్నాయి. ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.610-624గా ఉంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.240 కోట్లు సమీకరించింది.
లిస్టింగ్ తర్వాత, కంపెనీ క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నవిన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్, వినతి ఆర్గానిక్స్, PI ఇండస్ట్రీస్ మరియు ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీల జాబితాలో చేరింది. ఏథర్ ఇండస్ట్రీస్ IPO మే 24 నుంచి 26 వరకు తెరిచి ఉంది. ఇష్యూ 6.26 సార్లు సబ్‌స్ర్కైబ్ అయింది. సంస్థాగత కొనుగోలుదారుల (QIBలు) వాటా 17.57 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (NIIలు) 2.52 రెట్లు సబ్‌స్ర్కైబ్ చేసుకున్నారు. గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులకు మూలధన అవసరాలను తీర్చడానికి కంపెనీ తాజా ఇష్యూ నుంచి సేకరించిన నిధులను ఉపయోగిస్తుంది. డిసెంబర్ 31, 2021తో ముగిసిన తొమ్మిది నెలల్లో ఏథర్ ఇండస్ట్రీస్ నికర లాభం 14.30 శాతం నుండి 18.45 శాతానికి పెరిగింది. అయితే, మార్చి 2021తో ముగిసిన 12 నెలల్లో కంపెనీ ఆదాయం 49.04 శాతం పడిపోయింది. 2020 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 50.02 శాతంగా ఉంది.