Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. రాణిస్తున్న ఐటీ స్టాక్స్..
భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. వాల్ స్ట్రీట్‌తో పాటు ఆసియా మార్కెట్లు పాసిటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు కూడా పాసిటివ్‌గా ఓపెన్ అయ్యాయి..
భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. వాల్ స్ట్రీట్‌తో పాటు ఆసియా మార్కెట్లు పాసిటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు కూడా పాసిటివ్‌గా ఓపెన్ అయ్యాయి. సింగపూర్ ఎక్స్ఛేంజ్ (SGX నిఫ్టీ)లో నిఫ్టీ ఫ్యూచర్స్‌పై ట్రెండ్స్ దేశీయ సూచీలకు గ్యాప్-అప్ ప్రారంభాన్ని సూచించాయి. ఉదయం 9:20 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 539 పాయింట్లు పెరిగి 56,357 వద్ద కొనసాగుతుండగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 148 పాయింట్లు పెరిగి 16,776 వద్ద ట్రేడవుతోంది. మిడ్, స్మాల్ క్యాప్ కూడా సానుకూలంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.97, స్మాల్ క్యాప్ 0.60 శాతం పెరిగాయి.
నిఫ్టీలో టాప్ గెయినర్‌గా విప్రో కొనసాగుతోంది. ఈ స్టాక్ 2.82 శాతం పెరిగి రూ.487.50కు పెరిగింది. టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్‌ఈ- 30లో విప్రో, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, డా. రెడ్డీస్ లాభాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్‌టెల్, ఎన్టీపీసీ, మారుతి, టాటా స్టీల్, నెస్లే ఇండియా నష్టల్లో ట్రేడవుతున్నాయి.