Cement Prices: నిర్మాణ రంగంపై ధరల భారం.. దక్షిణాది రాష్ట్రాల్లో పెరిగిన సిమెంట్ ధరలు..
నిర్మాణ రంగంపై ధరల భారం పడుతోంది. నిర్మాణానికి సంబంధించి దాదాపు ప్రతి వస్తువు పెరిగింది. అటు మేస్త్రీ కూలీ కూడా పెరిగింది. తాజాగా ఇప్పుడు సిమెంట్ రేట్లు కూడా భారీగా పెరిగాయి. దక్షిణాది రాష్ట్రాల్లో 50 కిలోల సిమెంటు బస్తా ధరను రూ.20-30 మేర పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈనెల 2 నుంచే పెంచిన ధరలు అమల్లోకి వచ్చినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ముడి పదార్థాల అధిక ధరలతో పాటు ఇంధన వ్యయాలు పెరగడమే ఇందుకు […]
నిర్మాణ రంగంపై ధరల భారం పడుతోంది. నిర్మాణానికి సంబంధించి దాదాపు ప్రతి వస్తువు పెరిగింది. అటు మేస్త్రీ కూలీ కూడా పెరిగింది. తాజాగా ఇప్పుడు సిమెంట్ రేట్లు కూడా భారీగా పెరిగాయి. దక్షిణాది రాష్ట్రాల్లో 50 కిలోల సిమెంటు బస్తా ధరను రూ.20-30 మేర పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈనెల 2 నుంచే పెంచిన ధరలు అమల్లోకి వచ్చినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ముడి పదార్థాల అధిక ధరలతో పాటు ఇంధన వ్యయాలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బస్తాపై రూ.20 పెరగ్గా, తమిళనాడులో రూ.20-30 మధ్య పెరిగాయి. కర్ణాటకలో బ్రాండ్, ప్రాంతం ఆధారంగా ధరల పెంపు వేర్వేరుగా ఉంది. ధర పెరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సిమెంట్ బస్తా ధర రూ.320-400 మధ్య; తమిళనాడు, కర్ణాటకల్లో రూ.360-450 ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్‌లోనే ధరలు పెంచాలని చూసినా, కొనుగోళ్లు తక్కువగా ఉండటంతో డీలర్లు వ్యతిరేకిండంతో వాయిదా వేశారు. ఖర్చలు పెరగడంతో పెంచక తప్పలేదని కంపెనీలు చెప్పాయి. గత 3 రోజులుగా సిమెంట్ కంపెనీలు డీలర్లకు సరఫరాలు నిలిపి, ఇప్పటికే ఉన్న పాత స్టాక్ విక్రయించాల్సిందిగా కోరాయి. కొత్త ధర ప్రకారం, సరఫరాను గురువారం సాయంత్రం నుంచి ప్రారంభిస్తాయని డీలర్లు చెప్పారు.
ధరలు పెంచిన సంస్థలు:
- అల్ట్రాటెక్ సిమెంట్
- ఇండియా సిమెంట్స్
- కేసీపీ
- ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్
- సాగర్ సిమెంట్స్
- దాల్మియా భారత్
- శ్రీ సిమెంట్
- రామ్‌కో సిమెంట్స్
- ఓరియంట్ సిమెంట్