Skoda Slavia Price Hike: స్కోడా అభిమానులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన ధరలు
Skoda Slavia Price Hike: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వాహనాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ముడి సరుకు ధరల పెరుగుదల కారణంగా దాదాపు అన్ని కార్ల ధరలు పెరుగుతున్నాయి. ఇక..
Skoda Slavia Price Hike: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వాహనాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ముడి సరుకు ధరల పెరుగుదల కారణంగా దాదాపు అన్ని కార్ల ధరలు పెరుగుతున్నాయి. ఇక సెమీకండక్టర్ల కొరత కారణంగా స్కోడా కొత్తగా విడుదల చేసిన స్లావియా కారు ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ వెల్లడించింది. వేగంగా పెరుగుతున్న తయారీ వ్యయం కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. సంపాదన మార్జిన్‌ను కొనసాగించేందుకు స్కోడా దాదాపు అన్ని మోడళ్ల ధరలను పెంచింది. స్కోడా తన కొత్త సెడాన్ కారు స్లావియాను మూడు నెలల క్రితమే విడుదల చేసింది. స్కోడా లాంచ్ అయిన తర్వాత తొలిసారిగా స్లావియా ధరలను పెంచింది. కంపెనీ ఈ మిడ్-సైజ్ సెగ్మెంట్ సెడాన్ ధరను రూ.60,000 వరకు పెంచింది. వివిధ వేరియంట్‌ల ప్రకారం.. ఈ పెరుగుదల తర్వాత ఇప్పుడు కొత్త స్లావియా బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.99 లక్షలకు పెరిగింది. ఈ కారు టాప్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.18.39 లక్షలు.
మేలో కంపెనీ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు జూన్ నుంచి అమల్లోకి వచ్చింది. స్లావియా మూడు విభిన్న మోడళ్లలో అందించబడుతోంది. యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ వేరియంట్లు ఉన్నాయి. స్కోడా తన కస్టమర్లకు రెండు ఇంజన్ ఆప్షన్లలో అందిస్తోంది. ఒకటి 1 లీటర్ యూనిట్, మరొకటి 1.5 లీటర్ యూనిట్. స్లావియాకు చెందిన యాక్టివ్, ఆంబిషన్ మోడల్స్ ధరలను 30 వేల రూపాయలు పెంచారు.
స్టైల్ వేరియంట్‌లో కంపెనీ 1 లీటర్ ఇంజన్ ధరను 40 వేల రూపాయల వరకు పెంచింది. కాగా 1.5 లీటర్ పెట్రోల్ వేరియంట్ ధర 60 వేల రూపాయలు పెరిగింది. ఈ ధర పెరిగిన తర్వాత, కంపెనీ ఫీచర్లలో ఎలాంటి పెంపుదల చేయలేదు. తయారీ ధరల పెరుగుదల కారణంగా మాత్రమే ఈ ధరలు పెంచబడ్డాయి. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం కస్టమర్లకు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
టచ్ స్క్రీన్ డిస్‌ప్లే పరిమాణం తగ్గించబడింది:
స్లావియాలో మార్పులు చేస్తూ కంపెనీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ పరిమాణాన్ని 10 అంగుళాల నుండి 8 అంగుళాలకు తగ్గించింది. యాక్టివ్ బేస్ మోడల్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ 7 అంగుళాలకు తగ్గించబడింది. సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి