Doctor Strange: ‘డాక్టర్ స్ట్రేంజ్’ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న విజువల్ వండర్.. తెలుగులోనూ..
Doctor Strange: మార్వెల్ స్టూడియోస్ (Marvel Studios) నిర్మాణ సంస్థ నుంచి వచ్చే సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్‌కు చెందిన ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే చిత్రాలకు...
Doctor Strange: మార్వెల్ స్టూడియోస్ (Marvel Studios) నిర్మాణ సంస్థ నుంచి వచ్చే సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్‌కు చెందిన ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే చిత్రాలకు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. ఎన్నో ఫిక్షన్ పాత్రలకు ప్రాణం పోసిందీ సంస్థ. ఇలా ఈ నిర్మాణ రంగం నుంచి వచ్చిందే డాక్టర్ స్ట్రేంజ్ సినిమా. 2016లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆరేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ చిత్రం విడుదలైంది.
రూ. 1500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గత నెల 6న విడుదలైంది. మూవీ లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా రూ. వేల కోట్లు రాబట్టి సత్తా చాటింది. బెనడిక్ట్ కుంబర్ బ్యాచ్, ఎలిజబెత్ ఓల్సన్, జోచిటి గోమెజ్, వాండా మ్యాక్సిమాఫ్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది.
Marvel Studios’ Doctor Strange in the Multiverse of Madness streams from June 22 in Hindi, Tamil, Telugu, Malayalam, Kannada and English. pic.twitter.com/0655EjTUgI
— Disney+ Hotstar (@DisneyPlusHS) June 2, 2022
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా జూన్ 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లిష్, తెలుగుతో పాటు దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. దీంతో థియేటర్లలో సినిమా చూడడం మిస్ అయిన డాక్టర్ స్ట్రేంజ్ మూవీ లవర్స్ పండగచేసుకుంటున్నారు. మరి థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..