Actress : 24 ఏళ్లకే పెళ్లి కాకుండానే తల్లైంది.. 10 సంవత్సరాలుగా సినిమాలకు దూరం.. అయినా ఇప్పటికీ తగ్గని క్రేజ్..
సాధారణంగా సినీరంగంలో హీరోహీరోయిన్లకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఈమధ్య కాలంలో తారల లవ్, మ్యారెజ్, డివోర్స్.. ఇలా ప్రతి చిన్న విషయం నెట్టింట క్షణాల్లో చక్కర్లు కొడుతుంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ పేరు సైతం నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది.

వివాహం అనేది ఒక వ్యక్తిగత నిర్ణయం. సెలబ్రిటీల విషయానికి వస్తే, వారి వ్యక్తిగత నిర్ణయాలపై అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తూనే ఉన్నారు. ఇక ఈ నటి విషయానికొస్తే, ఆమె పెళ్లి చేసుకోకుండా జీవిస్తోంది. కానీ, ఆమె 24 ఏళ్లకే తల్లి అయింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే తాను తీసుకున్న నిర్ణయం కారణంగా ఆమె సినీ కెరీర్ మొత్తం నాశనమైపోతుందని ఆమె మేనేజర్ హెచ్చరించారు. కానీ ఆ నటి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత సైతం ఆమె వరుస హిట్ మూవీస్ చేసి స్టార్ డమ్ అందుకుంది. గత 10 ఏళ్లుగా ఆమె ఏ సినిమాల్లోనూ నటించలేదు. అయినప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ సుష్మితా సేన్.
ఎక్కువ మంది చదివినవి : Sirivennela Sitaramasastri : మనిషి జీవితంలో ఎదగటానికి ఈ లక్షణాలు ఉంటే చాలు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి..
1997లో ప్రవీణ్ గాంధీ దర్శకత్వంలో నాగార్జున నటించిన రక్షకుడు సినిమాలో కథానాయికగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత ఆమె అర్జున్ నటించిన ‘ముత్తలవన్’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించింది. కానీ ఆమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. తెలుగులో క్లిక్ కాకపోయినప్పటికీ ఆమె బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఎదిగింది. అయితే పెళ్లి చేసుకుండానే 2000వ సంవత్సరంలో 24 ఏళ్ల వయసులోనే ఒక బిడ్డను దత్తత తీసుకుంది. ఆమె ఆ బిడ్డకు రెనీ సేన్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత, 2010లో, ఆమె అలిస్సా అనే మరో పాపను దత్తత తీసుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో, ఆ సమయంలో తన మేనేజర్ అలా చేయవద్దని తనను గట్టిగా హెచ్చరించారని సుష్మితా సేన్ చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: ఒకప్పుడు లవర్ బాయ్.. వడ్డె నవీన్ కొడుకును చూశారా.. ? వైరలవుతున్న ఫోటోస్..
“నా నిర్ణయం తర్వాత, నా మేనేజర్ నా దగ్గర జాబ్ మానేశారు. నీకు నీ కెరీర్ పట్ల శ్రద్ధ లేదు. 24 ఏళ్లకే తల్లి అయిన మీతో నేను పనిచేయాలనుకోవడం లేదు. నీకు బాలీవుడ్‌లో కనీసం క్యారెక్టర్ రోల్ కూడా రాదు అని నా మేనేజర్ అన్నారు. కానీ, మీరు నమ్మరు. ఆ తర్వాతే నేను భారీ హిట్లు ఇచ్చాను ” అని చెప్పుకొచ్చింది సుష్మితా సేన్. 1994లో సుష్మితా సేన్ మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న భారతదేశపు మొట్టమొదటి మహిళగా నిలిచారు. అందాల పోటీకి బట్టలు కొనడానికి కూడా ఆమె దగ్గర డబ్బు లేదు. మిస్ యూనివర్స్ పోటీలో గెలిచినప్పుడు తాను ధరించిన దుస్తులను ఒక స్థానిక టైలర్ దగ్గర అప్పుగా కుట్టించుకున్నానని ఆమె చెప్పారు. సుష్మితా సేన్ చివరిసారిగా 2015లో విడుదలైన ఒక బెంగాలీ చిత్రంలో నటించారు. గత 10 సంవత్సరాలుగా ఆమె ఏ సినిమా చేయలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..
సుష్మితా సేన్ పోస్ట్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..
