AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?

టాలీవుడ్ సీనియర్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల సినిమా షూటింగులో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే కోలుకుంటున్నారు. మరికొన్ని రోజుల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.

Balakrishna: బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
Balakrishna, CM Chandrababu Naidu
Basha Shek
|

Updated on: Jul 26, 2026 | 8:26 PM

Share

హిందూపురం MLA నందమూరి బాలకృష్ణను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల సినిమా షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణ.. హైదరాబాద్‌లోని AIG ఆస్పత్రిలో సర్జరీ చేయించుకుని చికిత్స పొందుతున్నారు. దీంతో.. అమరావతి నుంచి హైదరాబాద్‌ వచ్చిన సీఎం చంద్రబాబు.. AIG ఆస్పత్రికి వెళ్లి బాలకృష్ణను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని సినీ డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేని కర్నాటకలోని కాటేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 18మంది వేద పండితులతో మహాయాగం, దాన్వంతరి హోమం నిర్వహించారు. ఈ పవిత్ర క్రతువులో దర్శకుడు గోపీచంద్ మలినేనితో పాటు నందమూరి అభిమానులు, చిత్ర సీమకు చెందిన పలువురు పాల్గొని బాలయ్య ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇక.. గోపిచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్‌లోనే బాలకృష్ణ గాయపడ్డారు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌ AIG ఆస్పత్రిలో బాలకృష్ణ ట్రీట్‌మెంట్‌లో ఉన్నారు.

కాగా బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రాక్ స్టార్ మంచు మనోజ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్ బాలయ్య అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ టీజర్ లో బాలయ్య చాలా స్టైలిష్ గా కనిపించాడు.  ఈ క్రమంలోనే ఎన్బీకే 111 (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ లోనే బాలయ్య గాయపడ్డారు.  మంచు మనోజ్‌తో యాక్షన్ సీన్ చేస్తున్న క్రమంలో బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయారు. దీంతో వెంటనే షూటింగ్ నిలిపేసిన ఈ మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలయ్యను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్ కు తీసుకెళ్లారు. ఇటీవలే ఆయనకు సర్జరీ నిర్వహించిన వైద్యులు మరో వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారు.

బాలయ్యతో చంద్రబాబు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us