AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..

ఇటీవల కొన్ని రోజులుగా సోషల్ మీడియా, యూట్యూబ్ లలో తెలంగాణ పల్లె పాటలు దుమ్మురేపుతున్నాయి. ముఖ్యంగా ఫుల్ ఎనర్జిటిక్ ఫోక్ సాంగ్స్ మిలియన్ వ్యూస్ అందుకుంటూ రచ్చ చేస్తున్నాయి. తాజాగా విడుదలైన ఒక ఎనర్జిటిక్ మాస్ సాంగ్ ఇప్పుడు ఇన్ స్టాలో దూసుకుపోతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఆ పాటకు స్టెప్పులేస్తున్నారు. ఇంతకీ ఆ పాట ఏంటంటే..

Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..
Folk Song
Rajitha Chanti
|

Updated on: Jun 07, 2026 | 2:20 PM

Share

తెలంగాణ జానపద గీతాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మట్టి వాసన, పల్లెటూరి అందాలు, స్వచ్ఛమైన ప్రేమానురాగాలను ప్రతిబింబించే పాటలు ఎప్పుడూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇటీవల విడుదలైన సరికొత్త ఫోక్ సాంగ్ ‘ఓ జానమ్మ’ (O Janamma) ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. అతి తక్కువ సమయంలోనే లక్షలాది వ్యూస్, లైకులతో ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్‌లో చేరిపోయింది. “దుబ్బురు దుబ్బురంటికాలు దువ్వరామ.. దువ్వనిస్తూవమ్మో ఓ జానమ్మ” అంటూ సాగే ఈ పాట పల్లెటూరి జానపద శైలిలో సాగుతుంది. బిందె మీద బిందె పెట్టి నీళ్లకు వెళ్లే పల్లెటూరి పడుచు అందాన్ని, ఆమె కోసం ఎదురుచూసే బావ మనోభావాలను ఈ పాటలో ఎంతో చక్కగా వివరించారు. “బింద మీద బిందెట్టి నవ్వుకుంట కన్ను పట్టి.. ఎవరికోసం ఎదురు చూపులో ఓ జానమ్మ” వంటి లైన్లు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. జానపద ఈలలు, డప్పుల మోతతో కూడిన సంగీతం వినేకొద్దీ వినాలనిపించేలా ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో ‏డేట్‏కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

ఈ సాంగ్ వీడియోలో జాను, సాగర్, ఉష అక్క , లీడింగ్ బాయ్స్ తమ నటనతో, డాన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా పచ్చని పొలాలు, బావులు, మట్టి రోడ్ల నేపథ్యంలో ఈ పాటను చాలా రిచ్‌గా చిత్రీకరించారు. నటీనటుల కాస్ట్యూమ్స్, వారి హావభావాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్నాయి. ముఖ్యంగా “చూడా చక్కనివాడు సుక్కలాన సెందరుడు.. నీ ఇంటికి కోడలైతనో ఓ రాజమ్మ” అంటూ సాగే సంభాషణ తరహా చరణాలు పాటలోని నాటుదనాన్ని మరింత పెంచాయి.

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..

ఈ సాంగ్ విడుదలైన నాటి నుండి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్‌లో ఈ పాట ఆడియో మార్మోగిపోతోంది. యూట్యూబ్‌లోనే కాకుండా రీల్స్ మేకర్స్ కూడా ఈ ఫోక్ బీట్‌కు స్టెప్పులు వేస్తూ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. జాను ఫోక్స్ ఛానెల్ గతంలో కూడా ఎన్నో సూపర్ హిట్ ఫోక్ సాంగ్స్ అందించగా, ఇప్పుడు ‘ఓ జానమ్మ’ పాట వారి ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పల్లెటూరి పాటలను ఇష్టపడే సంగీత ప్రియులకు ఈ 2026 లేటెస్ట్ ఫోక్ సాంగ్ ఒక మంచి విజువల్ అండ్ ఆడియో ట్రీట్ అని చెప్పవచ్చు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..

ట్రెండింగ్ ఫోక్ సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..

Follow Us