AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా.. తనికెళ్ల భరణి..

తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు తనికెళ్ల భరణి. సినిమాల్లోకి రాకముందు నాటక రంగంలో ఎంతో అనుభవం సంపాదించిన ఆయన.. మొదట రచయితగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. దర్శకుడు వంశీ రూపొందించిన ‘లేడీస్ టైలర్’ సినిమాతో రచయితగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘శివ’, ‘మనీ’, ‘గాయం’ వంటి ఎన్నో సెన్సేషనల్ సినిమాలకు ఆయన రాసిన డైలాగ్స్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి.

Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా.. తనికెళ్ల భరణి..
Tanikella Bharani
Rajitha Chanti
|

Updated on: Jun 04, 2026 | 2:48 PM

Share

తనికెళ్ళ భరణి గతంలో ఓ ఇంటర్వ్యూలో సినీ, సామాజిక, ఆధ్యాత్మిక అంశాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. ఆయన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా, నటుడు ధనుష్‌పై భరణి ప్రశంసల వర్షం కురిపించారు. రజనీకాంత్ అల్లుడైన ధనుష్, ఒక కమర్షియల్ హీరోగా హిందీలో ఏడు కోట్లు పారితోషికం తీసుకుంటున్నప్పటికీ, గత ఐదేళ్లుగా కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో చిన్న డైరెక్టర్లతో సినిమాలు నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ చిత్రాలన్నీ దాదాపు 10 కోట్లు సంపాదించడమే కాకుండా, అవార్డులు, నేషనల్ అవార్డులను కూడా గెలుచుకున్నాయని అన్నారు. ఇది “నువ్వు వ్యాపారం చేయకు, చేయించు. మాకియ్యి, మేం చేస్తాం” అనే అద్భుతమైన కాన్సెప్ట్‌ అని, ఇందులో రిస్క్ తక్కువని భరణి అభిప్రాయపడ్డారు. పెద్ద స్టార్ డైరెక్టర్లు కూడా ఈ మార్గాన్ని అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కసారి ముందుకు వెళ్ళిన వారు మళ్లీ వెనక్కి రావడం కష్టమని, అలాగే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన వారు నాటకాలు రాయరనే అభిప్రాయాన్ని ఖండించారు.

ఎక్కువమంది చదివినవి : Reema Sen : ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. ప్రతి విషయంతో తనతోనే షేర్ చేసుకుంటాను.. రీమా సేన్..

ఆధ్యాత్మిక విషయాలపై భరణి తన స్పష్టమైన అభిప్రాయాలను వెల్లడించారు. మానవ సేవనే మాధవ సేవ అని నమ్ముతానని అన్నారు. కేవలం మనిషికి మాత్రమే కాకుండా, ప్రాణుల పట్ల, చెట్ల పట్ల కూడా మానవత్వాన్ని చూపాలని, చెట్లను పెంచాలని సూచించారు. మన భారతీయ తత్వంలో చెట్టు, పిట్ట, పుట్ట, గుట్ట దేన్నైనా పూజిస్తామని, ఇది గౌరవానికి చిహ్నమని వివరించారు. డబ్బు శాశ్వతం కాదనే ఆలోచనను ఖండిస్తూ, అవసరానికి మించి సంపాదన వల్ల ఇబ్బందులు వస్తాయని, “నీ చెప్పు నంబరు ఏడు అయితే డబ్బూ అంతే ఉండాలి” అని తనదైన శైలిలో చెప్పారు.

ఎక్కువమంది చదివినవి : Raghavendra Rao : అది గొప్ప పాట.. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన సాంగ్.. రాఘవేంద్ర రావు మనసులో నిలిచిపోయిన పాట ఇదే..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, కవిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి తనికెళ్ల భరణి. కేవలం సంభాషణలతోనే కాకుండా, తన విలక్షణమైన అభినయంతో, కవితా హృదయంతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఆయన చెరగని ముద్ర వేశారు.

ఎక్కువమంది చదివినవి : Maheswari: ఆ హీరో అంటే క్రష్.. పిచ్చిగా ప్రేమించా.. చెల్లి అని మనసు ముక్కలు చేశాడు.. హీరోయిన్ మహేశ్వరి..

ఎక్కువమంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఒక్కో సీన్ ఊపిరి బిగపట్టి చూడాల్సిందే.. ఓటీటీలో రచ్చ చేస్తున్న మలయాళీ

Follow Us