AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghavendra Rao : అది గొప్ప పాట.. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన సాంగ్.. రాఘవేంద్ర రావు మనసులో నిలిచిపోయిన పాట ఇదే..

దర్శకుడు కె. రాఘవేంద్ర రావు, అన్నమయ్య చిత్రంలో హీరో ఇంట్రడక్షన్ కోసం చేసిన కృషిని వివరించారు. అన్నమయ్యను నందకాంశ సంభూతునిగా చూపించి, పాటల ద్వారా సంఘ సంస్కరణ చేసిన ధీరునిగా చిత్రీకరించారు. ఈ క్రమంలోనే ఆయన ఆల్‌టైమ్ ఫేవరెట్ పాట గురించి చెబుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Raghavendra Rao : అది గొప్ప పాట.. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన సాంగ్.. రాఘవేంద్ర రావు మనసులో నిలిచిపోయిన పాట ఇదే..
Raghavendra Rao
Rajitha Chanti
|

Updated on: Jun 03, 2026 | 10:25 AM

Share

దర్శకుడు కె. రాఘవేంద్ర రావు, తన అన్నమయ్య చిత్రం ద్వారా ఒక భక్తిరస చిత్రంలో ప్రధాన పాత్రకు ఎలా హీరోయిజాన్ని ఆపాదించాలో వివరించారు. సాధారణంగా సినిమా ప్రారంభంలో హీరో పరిచయం ఎంత శక్తివంతంగా ఉంటే, పాత్ర ప్రభావం అంత ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. ఈ విషయాన్ని సౌందర్య లహరి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు దర్శకుడు పైడిపల్లి వంశీ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా రాఘవేంద్ర రావు స్పష్టం చేశారు. భక్తి సినిమాల్లో హీరోయిజం చూపించడానికి తాను తీసుకున్న జాగ్రత్తలను, అనుసరించిన విధానాన్ని ఆయన వివరించారు. అన్నమయ్య చరిత్ర 500 సంవత్సరాల క్రితం నాటిదని, ఆయన 32,000 సంకీర్తనలు రచించిన గొప్ప కవి అని అందరికీ తెలుసు. అయితే, తాళపత్రాలపై కలంతో వేల పాటలు రాసిన అన్నమయ్యను ఎలా హీరోగా చూపించాలి అనేది బృందానికి పెద్ద సవాలుగా మారింది. కేవలం వెంకటేశ్వర స్వామి భక్తురాలైన లక్కమాంబకు కలలో స్వామి కనిపించి గొప్ప వ్యక్తి పుడతాడని చెప్పిన సంప్రదాయ కథనం హీరోయిజం ఎలివేషన్‌కు సరిపోదని రాఘవేంద్ర రావు భావించారు.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

అందుకే, దర్శకుడు రాఘవేంద్ర రావు, రచయిత భారవి కలిసి అనేక పుస్తకాలు అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో వారికి ఒక ఆసక్తికరమైన ఆధారం లభించింది. వెంకటేశ్వర స్వామికి శంఖు చక్రాలతో పాటు నందకం అనే ఖడ్గం కూడా ఉంటుందని, అన్నమయ్య ఆ నందకాంశ సంభూతుడు అని ఒక పుస్తకంలో ఉంది. ఈ ఆధారమే అన్నమయ్య హీరోయిజాన్ని చిత్రంలో అద్భుతంగా చూపించడానికి మూలమైంది. “పాటతో ప్రపంచాన్ని పావనం చేయడానికి అనతి కాలంలోనే ఆంధ్రావనిలో సంకీర్తనాచార్యుడిగా అవతరించబోతున్నాడు. మన నందకుడు. ఖడ్గం? సంకీర్తనాచార్యుడిగా అవతరించడమా? అవును దేవీ. పెరిగిపోతున్న పాపలతల్ని ఖండించడానికి కత్తుల్లాంటి కీర్తనలేగా కావాల్సింది. అందుకు నందక ఖడ్గమే సరి,” అంటూ చిత్రంలో అన్నమయ్య జన్మవృత్తాంతాన్ని ఆవిష్కరించారు. లక్కమాంబ గర్భంలో దైవాంశ సంభూతుడు, ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్ పుడుతున్నాడని ప్రేక్షకులకి ఈ సన్నివేశం ద్వారా స్పష్టంగా తెలియజేశారు. అన్నప్రాశన సమయంలో అన్నమయ్య కత్తి పట్టుకున్నాడని చూపించి, రెండోసారి అతని హీరోయిజాన్ని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

అక్కడి నుండి, ఆ ఖడ్గమే ఘంటంగా మారి, అన్నమయ్య కొన్ని వేల పాటలు రాసి, సమాజంలో ఉన్న దురాచారాలను, రుగ్మతలను చీల్చి చెండాడాడని చిత్రీకరించారు. అలాంటి గొప్ప పాటలలో బ్రహ్మమొక్కటే ఒకటి. ఈ పాటను కేవలం చదివి వదిలేయకుండా, జీవితాంతం గుర్తుంచుకుంటే, నేటి సమాజంలో ఉన్న కులమత భేదాల రొంపిలోంచి అందరూ బయటపడతారని రాఘవేంద్ర రావు అన్నారు. దేశం బాగుపడటానికి ఈ ఒక్క పాట చాలని, 500 ఏళ్ల క్రితమే సమాజంలోని రుగ్మతల గురించి ఇంత అద్భుతంగా రాశాడు కాబట్టే అన్నమయ్యను గొప్ప సామాజిక సంస్కర్తగా మనం చెప్పుకోవచ్చని ఆయన అన్నారు. ఈ పాట తన ఆల్‌టైమ్ ఫేవరెట్ అని, తాను పోయేవరకు ఈ పాటను మర్చిపోలేనని కె. రాఘవేంద్ర రావు స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

రాఘవేంద్రరావుకు నచ్చిన పాట..

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

Follow Us