AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Govt Jobs 2026: నిరుద్యోగులకు బంపర్ ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు

TGPSC AEE Recruitment 2026 Notification: తెలంగాణ రోడ్లు భవనాల శాఖలో 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి TGPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు, వయోపరిమితి, జీతం, దరఖాస్తు విధానం వంటి ఇతర పూర్తి వివరాలు ఈ కింద తెలుసుకోండి. .

TGPSC Govt Jobs 2026: నిరుద్యోగులకు బంపర్ ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు
TGPSC AEE Recruitment
Srilakshmi C
|

Updated on: Jun 10, 2026 | 7:57 PM

Share

ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) శుభవార్త అందించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ (R&B)లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 49 ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 15, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణలో ఏఈఈ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (A.M.I.E.) అసోసియేట్ మెంబర్‌షిప్ కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు చొప్పున వయోసడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ కింది TGPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో జులై 15, 2026 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చొప్పున చెల్లించాలి. అదనంగా పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాలి. ఉద్యోగంలో లేని నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష రుసుము రూ.120 నుంచి మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు వేతనం అందజేస్తారు.

ఇవి కూడా చదవండి

రాత పరీక్ష విధానం

మొత్తం 2 పేపర్లకు పరీక్ష ఉంటుంది. పేపర్ 1 పరీక్ష జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ విభాగంలో 150 ప్రశ్నలకు 150 మార్కులకు ఉంటుంది. పేపర్ 2 పరీక్ష ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో 150 ప్రశ్నలకు 300 మార్కులకు ఉంటుంది. రెండు పేపర్లకు కలిపి మొత్తం 450 మార్కులకు పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలను అక్టోబర్ 2026లో నిర్వహించనున్నారు.

తెలంగాణలో ఏఈఈ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు