AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sun Transit: మిథున రాశిలో రవి.. వారికి ప్రతి ప్రయత్నంలో విజయం..!

జూన్ 16 నుంచి జూలై 16 వరకు మిథున రాశిలో రవి సంచారం చేయనున్న నేపథ్యంలో కొన్ని రాశుల వారికి విశేష శుభఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమ్యూనికేషన్, ప్రయాణాలు, ప్రయత్నాలు, వృత్తి పురోగతికి సంబంధించిన ఈ సంచారం ప్రభావంతో చేపట్టే పనుల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, వృషభం, సింహం, కన్య, తుల, ధనుస్సు రాశుల వారికి ఆర్థికాభివృద్ధి, కెరీర్‌లో పురోగతి, కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి.

Sun Transit: మిథున రాశిలో రవి.. వారికి ప్రతి ప్రయత్నంలో విజయం..!
Sun Transit
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 10, 2026 | 8:02 PM

Share

అధికారానికి, అధికారులకు, ప్రభుత్వానికి, రాజకీయాలకు, పురోగతికి, తండ్రికి కారకుడైన గ్రహ రాజు రవి ఈ నెల(జూన్) 16 నుంచి జూలై 16 వరకు సందేశాలు, కమ్యూనికేషన్, ప్రయత్నాలు, ప్రయాణాలకు సంబంధించిన మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. దీనివల్ల కొన్ని రాశుల వారు ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం లభిస్తుంది. అధికార యోగానికి, ఉన్నత పదవులకు, ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం ఉంది. ఈ నెల రోజుల కాలంలో మేషం, వృషభం, సింహం, కన్య, తుల, ధనూ రాశుల వారు ఆర్థికంగా, కెరీర్ పరంగా, కుటుంబపరంగా శుభ యోగాలను అనుభవించే అవకాశం ఉంది.

మేషం

ఈ రాశికి పంచమాధిపతిగా అత్యంత శుభుడైన రవి తృతీయ స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో తమకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రభుత్వపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది.

వృషభం

ఈ రాశికి చతుర్ధాధిపతిగా అత్యంత శుభుడైన రవి ధన స్థానంలో ప్రవేశించడం వల్ల వారసత్వపు ఆస్తి సంక్రమిస్తుంది. పిత్రార్జితం లభించే అవకాశం కూడా ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమై విలు వైన ఆస్తి లభిస్తుంది. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. వాహన యోగం కూడా పడుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది.

సింహం

రాశ్యధిపతి రవి లాభ స్థానంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవు తుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విశేషంగా లాభిస్తాయి. తండ్రి వైపు నుంచి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో భారీ జీత భత్యాలతో కూడిన పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను దాటుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు.

కన్య

ఈ రాశికి దశమ స్థానంలో రవి ప్రవేశం వల్ల ఈ రాశివారికి దిగ్బల రాజయోగం కలిగింది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆస్తి, ఆర్థిక సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.

తుల

ఈ రాశికి లాభాధిపతి అయిన రవి భాగ్యస్థానంలోకి రావడం వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

ధనుస్సు

ఈ రాశికి భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన రవి సప్తమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో పాటు పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడానికి లేదా పెళ్లి జరగడానికి అవకాశం ఉంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

Follow Us
మిథున రాశిలో రవి.. వారికి ప్రతి ప్రయత్నంలో విజయం..!
మిథున రాశిలో రవి.. వారికి ప్రతి ప్రయత్నంలో విజయం..!
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?