AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..! బిర్యానీతోపాటు..

నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఏపీ కాకినాడలోని ఓ బార్ వినూత్న ఆఫర్లతో అభిమానులను ఆకట్టుకుంది. మ్యాన్సన్ హౌస్‌పై ఫ్రీ పెగ్, లిక్కర్‌పై 10 శాతం డిస్కౌంట్, రూ.5000కు పైగా బిల్లు చేస్తే ఉచిత దమ్ బిర్యానీ ఆఫర్ ప్రకటించడంతో అభిమానులు, మందుబాబులు భారీగా తరలివచ్చారు.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..! బిర్యానీతోపాటు..
Balakrishna Birthday Special
Shaik Madar Saheb
|

Updated on: Jun 10, 2026 | 6:48 PM

Share

బాలయ్య బాబు పుట్టిన రోజు అంటే ఆమాత్రం ఉంటుంది మరి.. ఈ బంపర్ ఆఫర్ చూసి.. అభిమానులతో పాటు మందుబాబులు సైతం పండగచేసుకుంటున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కాకినాడలోని ఒక బార్ నిర్వాహకులు వినూత్న ఆఫర్లు ప్రకటించారు. బాలయ్యకు ఇష్టమైన బ్రాండ్ మ్యాన్సన్ హౌస్ మూడు 60 ఎం ఎల్ పెగ్‌లు ఆర్డర్ చేస్తే, ఒక 30 ఎం ఎల్ పెగ్ ఉచితంగా ఇస్తామని బోర్డు పెట్టారు. అంతేకాకుండా బాలయ్య బర్త్ డే రోజు కొనుగోలు చేసే లిక్కర్‌పై ఏకంగా 10 శాతం డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించారు.

అంతేకాకుండా.. బార్‌లో రూ.5000 కంటే ఎక్కువ బిల్లు చేసిన వారికి 10 శాతం తగ్గింపుతో పాటు ఒక దమ్ బిర్యానీ ఉచితంగా ఇస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. బాలకృష్ణపై ఉన్న ప్రత్యేక అభిమానంతోనే ఆయన పుట్టినరోజున ఈ తరహా ఆఫర్లు ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు..

ఈ క్రేజీ ఆఫర్ల గురించి తెలియడంతో బాలయ్య అభిమానులు, మందుబాబులు ఆ బార్‌కు క్యూ కట్టి ఆఫర్లను ఎంజాయ్ చేస్తున్నారు.. మొత్తానికి బాలయ్య బాబు పుట్టిన రోజు అంటే ఇమాత్రం ఉంటుందని.. ఫాన్స్ తోపాటు.. ఇటు మందు బాబులు సైతం ఫుల్ ఖుషీ అవుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us