ప్రజలే నా దేవుళ్లు.. అది నా అదృష్టం: ప్రధాని మోదీ సంచలన ప్రసంగం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారంతో 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని, భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వరుస పదవీకాలంలో నెలకొల్పిన రికార్డును అధిగమించారు. 4,399 రోజుల పాటు ప్రధానిగా కొనసాగిన మోదీ, ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజలే తనకు దేవుళ్లని పేర్కొంటూ, దేశ సేవకు లభించిన ఈ అవకాశం తన జీవితంలో అత్యంత అద్భుతమైన క్షణమని అన్నారు.
ప్రధానమంత్రిగా బుధవారంతో 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని జవహర్ లాల్ నెహ్రూ రికార్డ్‌ను నరేంద్ర మోదీ బ్రేక్ చేశారు. నెహ్రూ 4,398 రోజులు ప్రధానిగా పనిచేయగా.. బుధవారంతో మోదీ 4, 399 రోజులు పూర్తి చేసుకున్నారు. పుష్కర కాలంగా దేశానికి సేవలందిస్తోన్న ప్రధాని మోదీకి ఎన్డీఏ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరిగింది. NDA కూటమి నేతల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. తన జీవితంలో అద్భుతమైన క్షణమని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ ప్రధానిగా సుధీర్ఘకాలం అవకాశం లభించడం తన అదృష్టమని పేర్కొన్నారు. దేశ ప్రజలే తనకు దేవుళ్లని పేర్కొన్నారు.
‘‘నా జీవితంలో ఇది అద్భుత క్షణం.. దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం అవకాశం లభించడం నాఅదృష్టం.. NDA కూటమి నేతలకు నా ధన్యవాదాలు.. నా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశా.. దేశ ప్రజలే నాకు దేవుళ్లు.. అధికారాన్ని సేవగానే భావించా.. ఎన్డీఏ కూటమిలో ప్రతి పార్టీకి సమాన ప్రాధాన్యం..’’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

