Namita: వేడుకగా హీరోయిన్‌ సీమంతం.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

Namita: 2017లో వ్యాపారవేత్త వీరేంద్రతో కలిసి పెళ్లిపీటలెక్కింది నమిత. తిరుపతిలో వీరి వివాహం వేడుకగా జరిగింది. ఈక్రమంలో తమ దాంపత్య బంధానికి గుర్తుగా త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది.

Namita: వేడుకగా హీరోయిన్‌ సీమంతం.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..
Namita
Follow us
Basha Shek

|

Updated on: Jun 04, 2022 | 8:06 PM

Namita: సుమారు రెండు దశాబ్దాల క్రితం సొంతం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నమిత (Namita). ఆ తర్వాత ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి, జెమిని, బిల్లా, సింహా తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమా కెరీర్‌లో ఎక్కువగా గ్లామర్‌ పాత్రలే పోషించిన ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌ – 1లో పాల్గొని బుల్లితెర పైనా అలరించింది. ఇక వ్యక్తిగత జీవిత విషయానికొస్తే.. 2017లో వ్యాపారవేత్త వీరేంద్రతో కలిసి పెళ్లిపీటలెక్కింది నమిత. తిరుపతిలో వీరి వివాహం వేడుకగా జరిగింది. ఈక్రమంలో తమ దాంపత్య బంధానికి గుర్తుగా త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. తన పుట్టిన రోజు (మే10)న తాను తల్లి కాబోతున్న విషయాన్ని వెల్లడించిన ఈ అందాల తార అప్పటి నుంచి తన బేబీబంప్‌ ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మాతృత్వపు మధురానుభూతులను ఆస్వాదిస్తోంది. ఇటీవల ఫొటోషూట్‌ కూడా జరుపుకుంది.

41 ఏళ్ల వయసులో అమ్మగా..

ఇవి కూడా చదవండి

కాగా తాజాగా నమిత సీమంతం (Namita Baby Shower) ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో నమిత సీమంతం వేడుక గ్రాండ్‌గా జరిగినట్లు తెలుస్తోంది. ఈ సెలబ్రేషన్స్‌లో చీరకట్టుతో ఎంతో అందంగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫొటోలు ట్రెండింగ్‌లో నిలిచాయి. సినీ సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు నమిత దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా 41 ఏళ్ల వయసులో నమిత తల్లికానుండడం గమనార్హం.

మరిన్ని ఎంటర్ టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Poco X4 GT: పోకో నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్‌ ఏంటో తెలుసా?

Deepak Chahar: ఒక అక్కగా ఏం మాట్లాడాలో కూడా తెలియదా? దీపక్‌ సోదరిపై మండిపడుతున్న నెటిజన్లు.. కారణమేంటంటే..

Vikram Movie Collections: బాక్సాఫీస్‌పై దండెత్తిన విక్రమ్‌.. మొదటి రోజు ఎంత వసూలు చేసిందంటే..