Vikram Movie Collections: బాక్సాఫీస్‌పై దండెత్తిన విక్రమ్.. మొదటి రోజు ఎంత వసూలు చేసిందంటే..
Vikram Movie:భారీ అంచనాలతో శుక్రవారం (జూన్3)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కమల్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌కు తోడు లోకేశ్ టేకింగ్‌కు అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
Vikram Movie: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) నాలుగేళ్ల తర్వాత నటించిన చిత్రం విక్రమ్ (Vikram). ఖైదీ, మాస్టర్ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన లోకేష్ కనగరాజ్ ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు దర్శకత్వం వహించారు. కమల్‌తో పాటు ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి (Vijay Sethupathi) లాంటి సూపర్ స్టార్లు ఈ చిత్రంలో నటించగా, సూర్య అతిథి పాత్రలో మెరిశాడు. ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో శుక్రవారం (జూన్3)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కమల్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌కు తోడు లోకేశ్ టేకింగ్‌కు అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీంతో కమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు విక్రమ్ ఎంత మేర కలెక్షన్లు రాబట్టాడో ఓ సారి తెలుసుకుందాం రండి. కాగా ఈ సినిమాను తెలుగులో విక్రమ్: హిట్ లిస్ట్ పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఓవర్సీస్‌లోనూ కలెక్షన్ల జోరు..
విక్రమ్ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు సుమారు 50 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఒక్క తమిళనాడులోనే 32.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. చెన్నైలోనే 1.71 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ యాక్షన్ డ్రామా ఈ వారాంతంలోపే 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 3.6 కోట్ల గ్రాస్, 2 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. కర్ణాటకలో, కేరళలో, ఉత్తరాదిలోనూ విక్రమ్ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కర్ణాటకలో ఈ చిత్రం 3.88 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా, కేరళలో రూ.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. హిందీలో అయితే రూ. 50 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. విక్రమ్ సినిమాకు ఓవర్సీస్‌లో కూడా బ్రహ్మండమైన వసూళ్లు దక్కుతున్నాయి. మొదటి రోజు ఓవర్సీస్‌లో రూ.11.50 కోట్లను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
Also Read:
Japan Population: ఇలాగే కొనసాగితే ఆ ప్రముఖ ఆసియా దేశం కనబడకపోవచ్చు.. ఆందోళన చెందుతున్న నిపుణులు!
Karnataka: కర్ణాటకలో మళ్లీ తెరపైకి మసీదుల వివాదం.. శాంతిభద్రతల నేపథ్యంలో భారీ బందోబస్తు