AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Japan Population: ఇలాగే కొనసాగితే ఆ ప్రముఖ ఆసియా దేశం కనబడకపోవచ్చు.. ఆందోళన చెందుతున్న నిపుణులు!

ఆసియా దేశంలో ఒకటైన జపాన్ లో కూడా జననాల రేటు తగ్గుతూనే ఉంది. గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో జననాలు రేటు పడిపోయిందని ఆ దేశ జాతీయ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలుస్తోంది

Japan Population: ఇలాగే కొనసాగితే ఆ ప్రముఖ ఆసియా దేశం కనబడకపోవచ్చు.. ఆందోళన చెందుతున్న నిపుణులు!
Japan Population
Surya Kala
|

Updated on: Jun 04, 2022 | 4:42 PM

Share

Japan Population: ఇప్పటికే చైనా, దక్షిణ కొరియా వంటి ఆసియా దేశాలతో పాటు యూరోపియన్ కంట్రీస్, ఉత్తర అమెరికా వంటి అనేక దేశాల్లో రోజు రోజుకీ జననాల రేటు తగ్గిపోతుంది. మరోవైపు వృద్ధుల రేటు అధికంగా మారుతుందనే ఆందోళన వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే బాటలో జపాన్ దేశం కూడా నడుస్తున్నట్లు జనాభాగణాంకాలు ద్వారా తెలుస్తోంది. అసలు రానున్న పదేళ్లలో ప్రపంచంలో యువత సంఖ్య  భారీ తగ్గిపోతుందా.. కొన్ని దేశాల్లో అసలు ప్రజలు లేకాకుండా తమ ఉనికి కోల్పోతాయా.. అని అంటే.. పలు జనాభా నివేదికలు ద్వారా అవును అనే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

ఆసియా దేశంలో ఒకటైన జపాన్ లో కూడా జననాల రేటు తగ్గుతూనే ఉంది. గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో జననాలు రేటు పడిపోయిందని ఆ దేశ జాతీయ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలుస్తోంది. 2021లో జపాన్ లో కేవలం 811,604మంది మాత్రమే జన్మించినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ సంఖ్య గత ఏడాదికంటే 3.5 శాతం తక్కువగా ఉంది.  2021 లో జనాల సంఖ్య గడిచిన 123 ఏళ్లలోనే  అత్యల్పం అని ఆరోగ్యశాఖ పేర్కొంది.  ముఖ్యంగా కరోనా మహమ్మారి కారణంగా ప్రజల్లో వ్యాధుల పట్ల భయాందోళనలు నెలకొన్నాయని.. పెళ్లి, పిల్లలపై ఆసక్తి తగ్గిందని జపాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. అంతేకాదు.. దేశంలో యువత, చిన్నారుల కంటే.. వృద్ధుల సంఖ్య భారీగా ఉందని.. ఇది ఇలా కొనసాగితే.. జనాభా వృద్ధి రేటు భారీ పడిపోతుందని అందోళన వ్యక్తం చేస్తున్నారు.

1975 నుండి జపాన్ లో సంతానోత్పత్తి రేటు క్రమంగా క్షీణిస్తూనే ఉంది.. ఇప్పుడు పతాకస్థాయికి చేరుకుందని.. ఇదే పరిస్థితి మరికొన్ని ఏళ్లపాటు కొనసాగితే.. మరొక 20-25 ఏళ్లల్లో దేశంలో జనాభా ఉండరని.. అప్పుడు దేశం ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడుతుందని ఆ దేశ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. కొన్ని ఏళ్ల తర్వాత జపాన్ దేశం అనేది ఉండేది అంటూ.. చరిత్రలో పాఠంగా చదువుకోవాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక వృద్ధుల రేటు భారీగా పెరుగుతూ.. పనిచేసే యువత సంఖ్య తగ్గుముఖం పట్టింది. దీంతో ఆ దేశ ఆర్ధిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక జపాన్ తాజాగా పరిస్థితిని తెలియజేస్తూ.. టెస్లా సంస్థ సీఈఓ ఎలాన్ మాస్క్ సోషల్ మీడియా లో ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..