- Telugu News Photo Gallery priyamani birthday the family man 2 actress priyamani busy with multiple projects in telugu
Priyamani Birthday: చేతినిండా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, రియాల్టి షోలు.. ప్రియమణి స్పీడ్ మాములుగా లేదుగా..
ప్రముఖ నటి ప్రియమణి ఈరోజు (జూన్ 4) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అభిమానులు, స్నేహితులు, సినీ ప్రముఖులు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ప్రియమణి చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి.
Updated on: Jun 04, 2022 | 6:41 PM

ప్రముఖ నటి ప్రియమణి ఈరోజు (జూన్ 4) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అభిమానులు, స్నేహితులు, సినీ ప్రముఖులు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ప్రియమణి చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి.

2003లో వెండితెరకు పరిచయమైన ప్రియమణి నేటికి అదే హవాను కొనసాగిస్తున్నారు. తన అందం, అభినయంతో జాతీయ అవార్డుతో పాటు ఎందరో అభిమానులను సంపాదించుకుంది.

ప్రియమణి సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్‌లలో కూడా ఫేమస్. ఆమె నటించిన ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్‌కు దేశ వ్యాప్తంగా మంచి పేరొచ్చింది.

బుల్లితెరపై కూడా ప్రియమణి హవా కొనసాగిస్తోంది. పలు డ్యాన్స్ రియాల్టీ షోలకు జడ్జిగా పని చేస్తూ ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుంటోంది.

ప్రియమణి పలువురు ప్రముఖ దర్శకులతో పని చేసింది. పునీత్ రాజ్ కుమార్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ ఆర్టిస్టులతో కూడా కలిసి స్ర్కీన్ షేర్ చేసుకుంది. కాగా ముస్తఫా రాజ్‌ను వివాహం చేసుకున్న ప్రియమణి ప్రస్తుతం సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉంది.

ప్రియమణి చేతిలో ప్రస్తుతం విరాట పర్వం, మైదాన్ (హిందీ), కైమారా, కొటేషన్ గ్యాంగ్, డీఆర్ 56 తదితర సినిమాల్లో నటిస్తోంది.





























