AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Barabar Premistha Review: ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా రివ్యూ.. చంద్రహాస్ వివాదం సినిమాకు కలిసొచ్చిందా..?

సోషల్ మీడియాలో 'యాటిట్యూడ్ స్టార్'గా గుర్తింపు తెచ్చుకున్న చంద్రహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'బరాబర్ ప్రేమిస్తా'. పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా మాస్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకలను మెప్పించిందా? అనేది రివ్యూలో చూద్దాం.

Barabar Premistha Review: 'బరాబర్ ప్రేమిస్తా' సినిమా రివ్యూ.. చంద్రహాస్ వివాదం సినిమాకు కలిసొచ్చిందా..?
Barabar Premista Movie
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Feb 07, 2026 | 8:26 AM

Share

మూవీ రివ్యూ: బరాబర్ ప్రేమిస్తా

నటీనటులు: చంద్రహాస్, మేఘనా ముఖర్జీ, అర్జున్ మహీ, మురళీధర్ గౌడ్, మధునందన్, మీసాల లక్ష్మణ్, అభయ్ నవీన్ తదితరులు.

సంగీతం: ఆర్ఆర్ ధృవన్

సినిమాటోగ్రఫి: వైఆర్ శేఖర్

డిటింగ్: బొంతల నాగేశ్వర్ రెడ్డి

దర్శకత్వం: సంపత్ రుద్ర

నిర్మాతలు: గేద చందు, గాయత్రి చిన్ని, వెంకటేశ్వరరావు

కథ:

రుద్రారం అనే గ్రామంలో కర్మానీ, ధర్మానీ అనే రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంటుంది. కులపరమైన ఆధిపత్యం కోసం ఈ రెండు వర్గాలు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కర్మానీ వర్గానికి చెందిన చందు (చంద్రహాస్), ధర్మానీ వర్గానికి చెందిన బుజ్జమ్మ (మేఘన ముఖర్జీ) ప్రేమలో పడతారు. మొదట ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవలు జరిగినా.. అవి ప్రేమగా మారతాయి. అయితే తమ ప్రేమకు గ్రామంలోని కుల పిచ్చి, పెద్దల గొడవలు అడ్డంకిగా మారుతాయని భావించిన చందు, బుజ్జమ్మ కేరళ పారిపోతారు. అక్కడ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ సరిగ్గా చందు తాళి కట్టే సమయానికి బుజ్జమ్మ పెళ్లికి నిరాకరిస్తుంది. అసలు బుజ్జమ్మ మనసు ఎందుకు మారింది? వారిద్దరి తండ్రుల మధ్య ఉన్న అసలు గొడవ ఏంటి? చివరికి వీరిద్దరూ ఒక్కటయ్యారా? ఈ కులాల గోడలను వీరి ప్రేమ బద్దలు కొట్టిందా? అనేదే మిగిలిన కథ.

కథనం:

తెలుగు తెరపై ఇప్పటికే కుల గొడవలు, ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో ఎన్నో ప్రేమకథలు వచ్చాయి. ‘బరాబర్ ప్రేమిస్తా’ కూడా దాదాపు అదే కోవలోకి వస్తుంది. కథ పరంగా చూస్తే ఇందులో పెద్దగా కొత్తదనం కనిపించదు. పాత కథనే దర్శకుడు సంపత్ రుద్ర తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశారు. హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్, వారి మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకండాఫ్ మొదలయ్యాక కథ కాస్త రొటీన్‌గా, నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ ప్రీ-క్లైమాక్స్ నుండి సినిమా ఊపందుకుంటుంది. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు సినిమా బాగానే ఉంది. పాత కథే అయినా, మీసాల లక్ష్మణ్ పాత్ర ద్వారా ఇచ్చిన ట్విస్ట్, ఎమోషనల్ సీన్స్ సినిమాను నిలబెట్టాయి. క్లైమాక్స్ డీల్ చేసిన విధానం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది.

నటీనటులు:

చందు పాత్రలో చంద్రహాస్ తనదైన యాటిట్యూడ్‌తో పర్లేదు. ముఖ్యంగా డ్యాన్సులు, ఫైట్స్ విషయంలో మంచి ఎనర్జీ చూపించాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ పర్వాలేదనిపించాడు. హీరోయిన్ మేఘన ముఖర్జీ అందంతో పాటు అభినయంతోనూ మెప్పించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మీసాల లక్ష్మణ్ గురించి. క్లైమాక్స్‌లో అతని పాత్ర సినిమా గమనాన్నే మార్చేస్తుంది. మధునందన్, మురళీధర్ గౌడ్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ టీం:

టెక్నికల్‌గా సినిమా ఓకే. ఆర్ఆర్ ధృవన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం కథకు తగినట్లుగా ఉన్నాయి. వైఆర్ శేఖర్ సినిమాటోగ్రఫి పల్లెటూరి అందాలను, యాక్షన్ మూమెంట్స్‌ని చక్కగా చూపించింది. ఎడిటింగ్ పర్లేదు. నిర్మాణ విలువలు బానే ఉన్నాయి. కథ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.

పంచ్ లైన్:

బరాబర్ ప్రేమిస్తా: రొటీన్ లవ్ స్టోరీనే.. కానీ ఓకే..!

Follow Us
జాలరి ముఖాన్ని చుట్టేసిన ఆక్టోపస్., ఊపిరాడక మృత్యువు అంచుల్లోకి..
జాలరి ముఖాన్ని చుట్టేసిన ఆక్టోపస్., ఊపిరాడక మృత్యువు అంచుల్లోకి..
వరాలు కురిపిస్తున్న వర మహాలక్ష్మీ.. వీరి జీవితాల్లో గొప్ప మార్పు
వరాలు కురిపిస్తున్న వర మహాలక్ష్మీ.. వీరి జీవితాల్లో గొప్ప మార్పు
10 వేల అడుగుల వాకింగ్ వెనుక పెద్ద బిజినెస్ సీక్రెట్..
10 వేల అడుగుల వాకింగ్ వెనుక పెద్ద బిజినెస్ సీక్రెట్..
రాఖీ పౌర్ణమి 27 లేదా 28నా.. గ్రహణం రోజు రాఖీ కట్టవచ్చా?
రాఖీ పౌర్ణమి 27 లేదా 28నా.. గ్రహణం రోజు రాఖీ కట్టవచ్చా?
ATM మిషన్ మీ కార్డును లోపలే ఎందుకు పట్టుకుంటుంది? అసలు కారణం ఇదే!
ATM మిషన్ మీ కార్డును లోపలే ఎందుకు పట్టుకుంటుంది? అసలు కారణం ఇదే!
వీరి ఇంటికి పరిగెత్తుక వస్తున్న అదృష్ట లక్ష్మీ.. చేతినిండా డబ్బే
వీరి ఇంటికి పరిగెత్తుక వస్తున్న అదృష్ట లక్ష్మీ.. చేతినిండా డబ్బే
ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు..
ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు..
మెయిడెన్ ఓవర్ల మొనగాడు.. వరుసగా 21 ఓవర్లలో 0 పరుగులు!
మెయిడెన్ ఓవర్ల మొనగాడు.. వరుసగా 21 ఓవర్లలో 0 పరుగులు!
చంద్రుడి అనుగ్రహం..ఆ రాశులను అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!
చంద్రుడి అనుగ్రహం..ఆ రాశులను అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!
రూ.20 వేల లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన టౌన్ ప్లానింగ్ అధికారి
రూ.20 వేల లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన టౌన్ ప్లానింగ్ అధికారి
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర