సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న క్రేజీ బ్యూటీ నిధి అగర్వాల్ 

Rajeev 

6 February 2026

నిధి అగర్వాల్.. ఈ అమ్మడు సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తుంది. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ భామ వరుసగా సినిమాలు చేస్తుంది. 

ఇటీవలే ఈ బ్యూటీ రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. 

నిధి అగర్వాల్ తెలుగులో చేసిన సినిమాలన్నింటిలో ఇస్మార్ట్ శంకర్ సినిమా ఒక్కటే ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

 ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది నిధి అగర్వాల్. ఆతర్వాత సక్సెస్ లు చూడలేదు నిధి అగర్వాల్. 

ఇక రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమాలో నటించింది కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. 

ఆతర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమాలో నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది నిధి అగర్వాల్.