Tollywood: జీవితంలో ఎక్కువ ప్రాధాన్యం దానికే! నెట్టింట వైరల్ అవుతున్న లక్కీ బ్యూటీ వీడియో
వెండితెరపై తన అందంతో, అభినయంతో కుర్రకారును మంత్రముగ్ధులను చేస్తోంది ఆ భామ. టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ ‘లక్కీ ఛామ్’గా పేరు తెచ్చుకుంది. సాధారణంగా హీరోయిన్లు అంటే డైటింగ్ పేరుతో కఠినమైన నియమాలు పాటిస్తారని, అసలు భోజనం సరిగ్గా చేయరని అందరూ అనుకుంటారు.

కానీ ఈ బ్యూటీ మాత్రం అందరికీ భిన్నం. తాజాగా ఆమె ఒక ఫంక్షన్‌లో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. అందులో ఆమె ఏకంగా తన ఫిలాసఫీని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన జీవితంలో దేనికంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందో చెబితే నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆ సంక్రాంతి క్వీన్ ఎవరు?
ఫుడ్ ఉంటే చాలు..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వేడుకలో పాల్గొన్న ఆమె, అక్కడ వడ్డించిన భోజనాన్ని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తూ కనిపించింది. ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందులో మీనాక్షి మాట్లాడుతూ.. “జీవితంలో నాకు స్ట్రెస్ అవేమీ వద్దు. నాకు ఫుడ్ ఉంటే చాలు.. మిగతావన్నీ సెకండ్” అని నవ్వుతూ చెప్పింది. సెలబ్రిటీ హోదాలో ఉండి కూడా ఇంత సహజంగా తన మనసులోని మాటను చెప్పడంతో అభిమానులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదే అసలైన లైఫ్ ఫిలాసఫీ అంటూ నెటిజన్లు ఆమెను ‘ఫుడ్ లవర్స్ క్వీన్’ అని పిలుస్తున్నారు.

Meenakshii Chowdary
మీనాక్షి చౌదరి కెరీర్ ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ఇప్పుడు ఆమె టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో నిర్మాతలకు ఆమె ఒక లక్కీ ఛామ్‌గా మారింది. వరుస అవకాశాలు ఆమె తలుపు తడుతుండటంతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ పరంగా సాఫీగా సాగిపోతోంది.
సంక్రాంతి క్వీన్..
ముఖ్యంగా మీనాక్షి చౌదరిని ‘సంక్రాంతి క్వీన్’ అని పిలవడంలో తప్పు లేదు. గత ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆమె, ఈ ఏడాది కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేసింది. ఈ సంవత్సరం ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. పండగ సీజన్ లో ఆమె సినిమా ఉంటే చాలు అది హిట్ గ్యారంటీ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే ఈ భామకు వరుసగా పెద్ద ప్రాజెక్టులు దక్కుతున్నాయి.
View this post on Instagram
మీనాక్షి చౌదరి క్రేజ్ కేవలం తెలుగు పరిశ్రమకే పరిమితం కాలేదు. ప్రస్తుతం ఆమెకు తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయి. అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. చేతినిండా ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఎక్కడా ఒత్తిడికి గురికాకుండా, తన ఫుడ్ ఫిలాసఫీని పాటిస్తూ ఎంజాయ్ చేయడం మీనాక్షి గొప్పతనం. తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఆమె సింప్లిసిటీని మరోసారి చాటి చెప్పింది. డైటింగ్స్, స్ట్రెస్ అంటూ కంగారు పడే లోకంలో మీనాక్షి చౌదరిలా భోజనాన్ని ప్రేమిస్తూ జీవితాన్ని గడపడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఆమె పాజిటివ్ ఆటిట్యూడ్ ఆమెకు మరిన్ని విజయాలను అందించాలని కోరుకుందాం.
