నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే, ఆ అలవాట్లే కారణం.. శ్రీలీల

Samatha

03 April 2026

అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

శ్రీలీల

ఈ చిన్నది తన అంద చందాలతో ఎంతో మందిని ఆకట్టుకుంది. పెళ్లి సందడి మూవీతో తెలుగు అభిమానులకు పరిచయమై, మొదటి సినిమాతోనే అందరి మనసు దోచుకుంది.

అందం, అభినయం

ఇక ఈ బ్యూటీ చేసిన చాలా సినిమాలు డిజాస్టర్ అయినప్పటికీ, ఈ అమ్ము క్రేజ్ మాత్రం తగ్గలేదు, వరసగా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తుంది.

క్రేజ్

అయితే తాజాగా ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకుంది. వ్యక్తిగత జీవితం, వృత్తిని బ్యాలెన్స్ చేయడంపై ఆసక్తికర విషయాలను తెలిపింది.

ఇంట్రస్టింగ్ విషయాలు

షూటింగ్ నుంచి బయటపడటానికి నేను కాసేపు పాటలు వినడం, ఇంట్లో వాళ్లతో వీడియో కాల్ మాట్లాడటం చేస్తాను దీని వలన షూటింగ్ మూడ్ నుంచి త్వరగా బయటపడతాను.

సాంగ్స్ వినడం

ఒక పాత్రలో లీనం అవ్వడం ఎంత ముఖ్యమూ దాని నుంచి బయటపడటం కూడా అంతే ముఖ్యం అంటూ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.

పాత్ర నుంచి బయటపడటం

చాలా వరకు ఈ వర్క్ ప్రెషర్ అనేది ఇంటి వరకు తీసుకెళ్లను, ఇక్కడివి ఇక్కడితోనే వదిలేస్తాను, అలా నేను సంతోషంగా గడుపుతాను అంటూ చెప్పుకొచ్చింది.

వర్క్ ప్రెషర్

ప్రస్తుతం శ్రీలీల చేసిన ఈ కామెట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

వైరల్ ఫొటోస్